తాజా వార్తలు

10/recent/ticker-posts

దళిత ఐక్యతతోనే హక్కుల సాధ్యం – జంగారెడ్డిగూడెంలో ఎస్‌సి కమిషన్ చైర్మన్ జవహర్‌కు ఘన సత్కారం


జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి, 23: రాష్ట్ర ఎస్‌సి కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.


పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్డులోని ఎన్‌టీఆర్ కూడలి వద్ద జవహర్‌కు శాలువా కప్పి, పూలమాలలతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జవహర్, ఎస్‌సిలు ఐకమత్యంగా ఉంటేనే తమ హక్కులను కాపాడుకోగలమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్‌సిల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ఆ దిశగా సమిష్టిగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.


అనంతరం సీనియర్ టీడీపీ నాయకుడు షేక్ ముస్తఫా తల్లి బేగం ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో, జవహర్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముస్తఫాతో తనకు ఎన్నో ఏళ్లుగా సాన్నిహిత్యం ఉందని, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇదే సందర్భంలో ఆర్‌టీసీ డ్రైవర్ రంగప్రసాద్ కుటుంబాన్ని కూడా జవహర్ పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమాల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కోషోర్, బొబ్బర రాజ్‌పాల్ కుమార్, పాతూరి అంబేద్కర్, పొదిలి ఫణికుమార్, ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకుడు లాగు ప్రకాష్, మద్దిపాటి ఉదయ్, ఎడ్లపల్లి ఏడుకొండలు, జొన్నకూటి శ్రీనివాస్, పొలిమేర శ్రీనివాస్, ముప్పిడి విష్ణు, కొత్తూరు బోసు, దిద్దే దుర్గారావు, తానిగడప శేషు, పోల్నాటి చిన్నబాబు, సనమండ్ర చిన్నరాజు, కలపాల ప్రసాద్, పులపాకుల గాంధీ, తగరం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.