తాజా వార్తలు

10/recent/ticker-posts

స్వచ్ఛందర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ


కొయ్యలగూడెం: రాష్ట్రంలో పరిశుభ్రత, పారదర్శకత మరియు ప్రజా సేవల నాణ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న స్వచ్ఛందర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు.

ఆసుపత్రిలో అమలు చేస్తున్న బార్కోడ్ ఆధారిత బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ విధానాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. వ్యర్థాలను వర్గీకరించడం, సేకరించడం, భద్రపరచడం, తరలించడం వంటి ప్రక్రియలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా అనే విషయంపై అధికారులను ప్రశ్నించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రాణాంతక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యుల అందుబాటు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత ప్రమాణాలు, సిబ్బంది సేవాభావం వంటి అంశాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరించాలని వైద్యాధికారులకు ఆదేశించారు.

శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. ప్రతి వార్డులో ప్రతిరోజూ క్రమబద్ధమైన శుభ్రత కార్యక్రమం నిర్వహించడంతో పాటు వ్యర్థాలను సమయానికి సేకరించి నిర్ణీత ప్రదేశాలకు తరలించాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల విశ్వాసాన్ని పొందేలా అత్యుత్తమ సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. “పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారం. నాణ్యమైన వైద్య సేవలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం మనందరి బాధ్యత” అని చిర్రి బాలరాజు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు తోట రవి, సొసైటీ అధ్యక్షులు దుగ్గిన శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ వామిశెట్టి మధు, కోకోనర్ దాకారపు మధు, మేడిన కన్నయ్య, జనసేన జిల్లా నాయకులు చోడి పిండి సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు, వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.