తాజా వార్తలు

10/recent/ticker-posts

ధర్మాజీగూడెంలో మొబైల్ ఐసీటీసీ వ్యాన్ ద్వారా హెచ్‌ఐవీ పరీక్షలు, అవగాహన


ఏలూరు జిల్లా, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: జిల్లా వైద్యశాఖాధికారి ఆదేశాల మేరకు, డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీస్ ఫర్ హెచ్‌ఐవీ ఎయిడ్స్ కార్యక్రమంలో భాగంగా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో విస్తృత ఆరోగ్య అవగాహన మరియు పరీక్షల శిబిరం నిర్వహించారు.


ధర్మాజీగూడెం ప్రైమరీ హెల్త్ సెంటర్ మరియు చిల్డ్ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో మొబైల్ ఐసీటీసీ వ్యాన్ ద్వారా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ మరియు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. మొబైల్ ఐసీటీసీ సేవల ద్వారా హెచ్‌ఐవీ, సిఫిలిస్ రక్తపరీక్షలతో పాటు బీపీ, ఆర్‌బీఎస్ (రక్తంలో చక్కెర), హెచ్‌బీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన రోగులకు మందులు కూడా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యురాలు డా. వై. ప్రియాంక, ఎంవీఎస్ రామ్ మోహన్, మొబైల్ ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ హనుమంతు పాల్గొన్నారు. అలాగే చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ జి. రాజశేఖర్, జోనల్ సూపర్వైజర్ కె. సుజాత, క్లస్టర్ లింక్ వర్కర్ పి. రాజశేఖర్, ఏఎన్ఎం డి. విమలాదేవి, సూపర్వైజర్లు సీహెచ్. పార్థసారధి, కె. రాణి, హెల్త్ అసిస్టెంట్ జి. దుర్గాప్రసాద్, ఆశా వర్కర్లు ఆర్. అలేఖ్య, టి. నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో మొబైల్ ఐసీటీసీ సేవలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వైద్య అధికారులు తెలిపారు.