ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: ఏలూరు జిల్లాను అవినీతిరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జి.వి. కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. అవినీతి లేని సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో ఎక్కడైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరినా, అవినీతికి పాల్పడినా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. అందుకు టోల్ ఫ్రీ నంబర్ 1064 తో పాటు 9440446157, 9440446158, 9440446159 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఫిర్యాదు చేసే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని డీఎస్పీ కృష్ణారావు స్పష్టం చేశారు. అవినీతిని రూపుమాపడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
అవినీతిరహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, తప్పులు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని ఆయన కోరారు.







