ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: జిల్లా ఉపాధి కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) ఆధ్వర్యంలో ఏలూరులో ఈ నెల 13న జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పి.వి. రమేష్ కుమార్ తెలిపారు. ఉదయం 10:00 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం, ఏలూరు కార్యాలయ ప్రాంగణంలో ఈ నియామక కార్యక్రమం జరగనుంది.
ఈ జాబ్ డ్రైవ్‌లో Safe Macc Society Ltd., Bajaj Capital వంటి సంస్థలు పాల్గొంటున్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్న పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఖాళీలు ఉన్న పోస్టులు:
బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ డెవలప్‌మెంట్ మేనేజర్, బ్రాంచ్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, టెలి ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.13,000 నుంచి రూ.30,000 వరకు జీతం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
అభ్యర్థులు ఫార్మల్ డ్రస్ కోడ్‌లో హాజరుకావాలని, అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలు మరియు రిజ్యూమ్ తీసుకురావాలని సూచించారు. ముందస్తు నమోదు కోసం https://bit.ly/ncsregister-wg లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే employment.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
మరిన్ని వివరాల కోసం 8886882032, 7416118388 నంబర్లను సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి సూచించారు.
ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.







