Hot Posts

6/recent/ticker-posts

అధినాయకుడు జోలికొస్తే ఊరుకోం - జనసేన కౌన్సిలర్ల హెచ్చరిక..


పవన్ కళ్యాణ్‌పై అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి..
అమలాపురం సీఐకి మున్సిపల్ కౌన్సిలర్ల ఫిర్యాదు..


తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై బహిరంగంగా, పునరావృతంగా అసభ్య, అవమానకర వ్యాఖ్యలు చేసిన మహిళపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్లు గురువారం అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో పట్టణ సిఐ పి.వీరబాబుకు ఫిర్యాదు చేశారు‌.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బొజ్జ ఐశ్వర్య అనే మహిళ సామాజిక మాధ్యమాలు, బహిరంగ వేదికల ద్వారా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలను అభిప్రాయ స్వేచ్ఛగా పరిగణించలేమని, ఇవి ప్రజానాయకుడి ప్రతిష్ఠకు భంగం కలిగించడంతో పాటు శాంతిభద్రతలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని కౌన్సిలర్లు స్పష్టం చేశారు.

భారత శిక్షాస్మృతి (IPC), సమాచార సాంకేతిక చట్టం (IT Act)లోని నిబంధనల ప్రకారం ఈ వ్యాఖ్యలు నేర పరిధిలోకి వస్తాయని వారు అభిప్రాయపడ్డారు. అందువల్ల సంబంధిత వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను సేకరించి పరిశీలించి కేసు నమోదు చేసి, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్లు పోలీసులను కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు యేడిద శ్రీను, తిక్కా సత్యలక్ష్మి, గొలకోటి విజయలక్ష్మి, జనసేన నాయకులు పిండి రాజా, పడాల నానాజీ, గండి స్వామి, తిక్కా ప్రసాద్, గోలకోటి వాసు తదితరులు పాల్గొన్నారు.