మనబడికి మహా న్యూస్' కార్యక్రమాన్ని ప్రశంసించిన మంత్రి నారా లోకేశ్
ప్రభుత్వ పాఠశాలల్లోని సంస్కరణలను చూపించడంపై హర్షం వ్యక్తం
సోషల్ మీడియా వేదికగా మహా న్యూస్ ఛానల్‌కు అభినందనలు
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొస్తామని వెల్లడి
ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు
ANDHRAPRADESH:రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన సంస్కరణలు, వాటి ద్వారా వస్తున్న సానుకూల ఫలితాలపై 'మనబడికి మహా న్యూస్' పేరిట ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్న 'మహా న్యూస్' ఛానల్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
"ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మేము చేపట్టిన సంస్కరణలు, వాటి ఫలితాలు "మనబడికి మహా న్యూస్" పేరుతో ప్రసారం చేస్తున్న మహా న్యూస్‌కు అభినందనలు. దేశంలోనే సమున్నతంగా నిలిచేలా కూటమి ప్రభుత్వం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒకేసారి మహా న్యూస్ చేస్తున్న ఈ ప్రసారాలు ప్రభుత్వ విద్యా వికాసానికి ఎంతో దోహదం చేస్తాయి. తొలిసారిగా ప్రభుత్వ విద్యాలయాల్లో జరిగిన మంచి గురించి నాన్ స్టాప్ కథనాలు చేస్తున్న మహా న్యూస్ యాజమాన్యానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi