HJYDERABAD:సికింద్రాబాద్ నుండి జోధ్‌పూర్ వెళ్ళే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన కేంద్రం ప్రతీరోజూ కాచిగూడ-భగత్ కీ కోఠీ రైలును నిన్న కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి ప్రయాణికులకు అందించింది . అయితే ఈ రైలుప్రయాణం కాస్త ఎక్కువ సమయం తీసుకుంటోంది. సికింద్రాబాద్-హిస్సార్ ఎక్స్‌ప్రెస్ (22737) రైలులో వెళితే జోధ్‌పూర్ చేరుకోవడానికి 32 గంటల 10 నిమిషాలు పడితే, కాచిగూడ-భగత్ కీ కోఠీ (జోధ్‌పూర్-17605) ఎక్స్‌ప్రెస్ 44 గంటల 10 నిమిషాలు పడుతుంది
కాచిగూడ-భగత్ కీ కోఠీ ఎక్స్‌ప్రెస్ తో ప్రయాణమిలా
కాచిగూడ-భగత్ కీ కోఠీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం ప్రారంభమవుతుంది. ఇది వారమంతా నడుస్తుంది. అయితే, ఈ రైలు జోధ్‌పూర్ చేరుకోవడానికి, పాత రైలుతో పోలిస్తే దాదాపు 12 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రయాణికులు రెండు రాత్రులు రైళ్లలోనే గడపాల్సి వచ్చేలా ఉంది. తెలంగాణాలో చాలా మంది రాజస్థాన్ నుండి వచ్చినవారు చాలామంది ఉన్నారు. వీరంతా ఎక్కువసార్లు జోధ్‌పూర్ , అజ్మీరా వంటి ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు.
కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సగటు వేగం గంటకు 44 కిలోమీటర్లు
అయితే జోధ్‌పూర్ వెళ్ళేవారు సికింద్రాబాద్-హిస్సార్ ఎక్స్‌ప్రెస్ లో వెళ్తే ఆ రైలు సగటు వేగం గంటకు 56 కిలోమీటర్లు, ఇది 32 గంటల 10 నిమిషాలు ప్రయాణంతో కూడుకుని ఉంటుంది. నిజామాబాద్, నాందేడ్ మార్గంలో నడిచే కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సగటు వేగం గంటకు 44 కిలోమీటర్లు. ఈ రైలు మొత్తం 1,941 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో ప్రయాణానికి 44 గంటల 10 నిమిషాలు పడుతుంది.
సింగిల్ లైన్‌లో నడవటం వల్లే ప్రయాణ జాప్యం
ఈ రైలు కాచిగూడ-నిజామాబాద్ మార్గంలో సింగిల్ లైన్‌లో నడుస్తుంది. కనుక ఈ రైలు ప్రయాణం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాచిగూడ-భగత్ కీ కోఠీ రైలుకు ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోగీలు గంటకు 150 నుండి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ రైలును డబుల్ లైన్ ఉన్న వరంగల్, భువనగిరి, రామగుండం, మంచిర్యాల మీదుగా నడిపితే సగటున గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

Shakir Babji Shaik
Editor | Amaravathi