HYDERABAD:తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల ప్రమోషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఫైల్ పైన సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. ప్రభుత్వ టీచర్లకు ప్రమోషన్లకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో పూర్తి షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం. దాదాపు పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఇది భారీ ఊరటనిచ్చే అంశంగా భావించవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు లభించనున్నాయి.
ఇక ఇప్పటికే రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. ఈ మేరకు ప్రాథమిక పాఠశాలల్లోని ఎల్ కేజీ, యూకేజీ ల్లో ఇంగ్లీష్ మీడియం, ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణం, అంగన్ వాడీల్లో మెనూ మార్పు తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాక ఇటీవల సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అబ్బాయిలకు ఒకటి, అమ్మాయిలకు ఒకటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణాలను చేపడతామని అన్నారు.