Hot Posts

6/recent/ticker-posts

కమలానికి ఈటెల ముల్లు గుచ్చుతోంది !


ఇదిలా ఉంటే ఈటల ఇంత హార్ష్ గా మాట్లాడినా ఆయన వ్యాఖ్యల విషయంలో ఎవరూ ఏమీ మాట్లాడొద్దు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తన అనుచరులకు సూచించడం విశేషం.

HYDERABAD:తెలంగాణా బీజేపీలో ఇపుడు అసంతృప్తి గొంతులు పెద్దవి అవుతున్నాయి. ఫైర్ బ్రాండ్ కాబట్టి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ముందే తన నోరు పెంచి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. రాజకీయ వ్యూహాల్లో దిట్ట అనిపించుకున్న సీనియర్ నేత మల్కాజ్ గిరీ ఎంపీ అయిన ఈటల రాజెందర్ తీరు అలా కాదు. ఆయన కమలానికే కలవరం రేపుతున్నారు. తాజాగా ఆయన తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు.

నా మనుషులను సర్పంచ్ ఎన్నికల్లో దింపి గెలిపించుకుంటాను అని కూడా అన్నారు. ఇక ఆయన పేరు ఎత్తలేదు కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అని కమలం పార్టీ పెద్దలు విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నారుట. ఆయనకు రెండు రోజులలో షోకాజ్ నోటీస్ జారీ చేస్తారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈటల ఇంత హార్ష్ గా మాట్లాడినా ఆయన వ్యాఖ్యల విషయంలో ఎవరూ ఏమీ మాట్లాడొద్దు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తన అనుచరులకు సూచించడం విశేషం. దాంతో ఆయనకు కేంద్ర పెద్దల నుంచి ఏవో డైరేక్షన్లు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. 

మరో వైపు నుంచి చూస్తే ఈటల గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు అని అంటున్నారు. ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఏమీ పెద్దగా సాధించలేకపోయారు అన్నది బాధగా ఉందని అంటున్నారు. కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని ఆశపడినా నిరాశ ఎదురైంది. అలాగే తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ పదవి కూడా దక్కలేదు. ఇంకో వైపు ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్తారా అన్నది కూడా ప్రచారం చేస్తున్న వారు ఉన్నారు.

ఇపుడు చూస్తే ఏకంగా ఈటల కొత్త పార్టీ పెడతారు అని ప్రచారం మొదలెట్టేశారు. ఆ పార్టీకి తెలంగాణ బహుజన సమితి పేరు కూడా కొందరు ఖరారు చేశారు. తెలంగాణాలో ఇపుడు బీసీల మీదన పోరు సాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా డిమాండ్ ఉంది. ఈటల తన అనుచరులు అభిమానుల సమావేశంలో కూడా తెలంగాణాలో వందా నూటయాభై నోరు లేని బీసీ కులాలకు రాజ్యాధికారం కోసం పోరాడిన చరిత్ర తనకు ఉందని చెప్పుకున్నారు. 

బీసీ సీఎం అన్నది తెలంగాణాలో కొత్త రాజకీయ నినాదంగా ఉంది. దాంతో ఈటెల ఆ విధంగా అడుగులు వేస్తారా అన్నది అంతా చర్చించుకుంటున్నారు. అంగబలం అర్ధబలం రెండూ కలిగి ఉన్న ఈటల కనుక కొత్త పార్టీ పెడితే తెలంగాణాలో మరో పొలిటికల్ ఫోర్స్ కి చాన్స్ ఉంటుందా అన్నది కూడా ఆలోచిస్తున్నారు.

ఏది ఏమైనా ఒక్కటి నిజమని అంటున్నారు. ఈటల కమలం పార్టీలో ఇమడలేకపోతున్నారు. ఇక ఆయన అక్కడ ఉండేందుకు కూడా కొన్ని అంతర్గత శక్తులు అడ్డుకట్ట వేస్తున్నాయని అంటున్నారు. బీజేపీలో చూస్తే పదవులు అన్నీ మొదటి నుంచి ఉన్న వారికే ఇస్తారు తప్ప కొత్తగా వచ్చిన వారికి అవి దక్కవు. ఈ సత్యం అర్ధమైన తరువాతనే ఈటల గొంతు విప్పుతున్నారు అని అంటున్నారు. ఆయన తనకేమీ నష్టం లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు అంటే వేరే ఆలోచనలు చేస్తున్నారా అన్నది కూడా ఉంది. ఏది ఏమైనా ఈటల వర్సెస్ బండి కాస్తా ఈటెల వర్సెస్ బీజేపీగా మారుతుందా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi