Hot Posts

6/recent/ticker-posts

సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ స్టాపేజీల పై కీలక నిర్ణయం, ఇక..!!


ANDHRAPRADESH:వందేభారత్ రైళ్ల నిర్వహణలో అధికారులు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా నిర్ణయాల ను తీసుకుంటున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ రైలు విషయం లో తాజాగా రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే ఈ రైలుకు ఉన్న ఆక్యెపెన్సీ కారణం గా కోచ్ లు పెంచుతూ నిర్ణయించిన అధికారులు .. తాజాగా స్టాపేజీల విషయంలో మరో నిర్ణయం అమలుకు సిద్దమయ్యారు.

సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రారంభమైన తొలి వందేభారత్ కు ఆక్యుపెన్సీ రేషియో పెరుగు తోంది. దీంతో, కొద్ది రోజుల క్రితమే ఈ రైలును అప్ గ్రేడ్ చేస్తూ రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రస్తుతం 16 కోచ్ లతో నడుస్తున్న ఈ రైలు నేటి నుంచి 20 కోచ్ లతో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నిత్యం వెయిటింగ్ లిస్టు ఉంటున్న ఈ రైలు ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణీకులు ఈ రైలుకు ప్రాధాన్యత ఇస్తు న్నారు. కాగా, సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల విషయంలో తాజాగా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వందేభారత్ అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఫిబ్రవరిలో ప్రారంభించిన అదనపు స్టాపేజీ (ఏలూరు) సదుపాయం ఆగస్టులో ముగియనుంది. ఆగస్టు 25నుంచి ఏలూరులో, 20833/20834 వందేభారత్‌ ఎక్ స్‌ప్రెస్‏లకు ఆగస్టు 2నుంచి సామర్లకోట లో అదనపు స్టాపేజీలు మరో ఆరునెలల పాటు కొనసాగు తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త వందే భారత్ రైళ్ల ప్రతిపాదనల పైన కసరత్తు కొనసాగుతోంది.

ప్రస్తుతం వందేభారత్ స్లీపర్ ను పట్టాలు ఎక్కించేందుకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ స్లీపర్ కేటాయించేలా రైల్వే శాఖ ఆలోచన చేస్ తున్నట్లు సమాచారం. అదే జరిగితే.. తొలి వందేభారత్ స్లీపర్ విశాఖ నుంచి తిరుపతికి అందుబా టులోకి రానుంది. ఇక, సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందేభారత్ స్లీపర్, విజయవాడ నుంచి అయోధ్య కు మరో రైలు పైనా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీటి పైన రెండో విడతలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi