HYDERABAD:రైలు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందించే లక్ష్యంతో భారతీయ రైల్వేలు చేపట్టిన "అమృత్ భారత్ స్టేషన్ పథకం"లో భాగంగా, హైదరాబాద్‌లోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ రూ. 26.81 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చెందుతోంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఈ స్టేషన్, ఫలక్‌నుమా - కాచిగూడ సెక్షన్‌లో ఉంది. రోజుకు సగటున 5,000 మంది ప్రయాణికులు, ముఖ్యంగా హైటెక్ సిటీ, లింగంపల్లి వంటి పశ్చిమ ప్రాంతాలకు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లేవారు ఈ స్టేషన్‌ను వినియోగిస్తారు. ఇక్కడ రోజుకు సుమారు 50 రైళ్లు ఆగుతాయి.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఉప్పుగూడలో చేపట్టిన పనులు:
నూతన ముఖద్వారం, రెండవ ప్రవేశ ద్వారం వద్ద స్టేషన్ భవన అభివృద్ధి
స్టేషన్ ఆవరణ ప్రాంత అభివృద్ధి.
12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం
4.2 ప్యాసింజర్ లిఫ్ట్‌లు, 2 ఎస్కలేటర్ల ఏర్పాటు
5.ప్లాట్‌ఫామ్ ఉపరితలం మెరుగుదల, అదనపు ప్లాట్‌ఫామ్ పైకప్పులు
కాన్కోర్స్ & వెయిటింగ్ హాళ్ల లోపలి పునరుద్ధరణలు
7.దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్లు
8.నూతన సూచిక బోర్డులు, నూతన ఫర్నిచర్
ప్రస్తుతం వెయిటింగ్ హాల్ మెరుగుదలలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి గిర్డర్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. పార్కింగ్ షెడ్ల కాంపౌండ్ వాల్ నిర్మాణం చివరి దశలో ఉంది. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌ల షీటింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. అన్ని పనులు ఏకకాలంలో జరుగుతుండగా, డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పునరాభివృద్ధి పనులు పూర్తయితే, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించనుంది.