ANDHRAPRADESH:డా బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: అమలాపురం రూరల్ మండలం నడిపూడి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో ఆదివారం జరిగిన అధికారుల సన్మాన సభకు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మోకాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. విద్యుత్ శాఖలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తూ సీజీఎంగా పదోన్నతిపై విశాఖపట్నం వెళ్ళిన ఎస్ రాజబాబు దంపతులకు దుస్సాల్వ కప్పి భారీ గజమాలతో ఘన సత్కారం చేశారు. అదేవిధంగా అమలాపురం తహశీల్దార్ అశోక ప్రసాద్,
ఈఈ విజయానంద్,
అమలాపురం ఈఈ రాంబాబు,
రామచంద్రపురం ఈఈ రత్నాలరావు,
రాష్ట్ర దండోరా సీనియర్ నాయకులు బోయిలపల్లి కరుణాకర్,
పెద్దాపురం ఏఈ కాప రామచంద్రరావు
పదవీ విరమణ పొందిన సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సవరపు నాగేశ్వరరావు,
రాష్ట్ర కరాటే పోటీలలో ప్రథమ బహుమతి పొందిన
చిరంజీవి మంద మౌనిక.
ప్రపంచ తెలుగు మహాసభలలో తన వాగ్దాటికి ప్రథమ బహుమతి ఇచ్చి సత్కరింపబడిన దళిత యువకవిత్రి ఎస్ కావ్య లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.
సీజీఎం రాజబాబు మాట్లాడుతూ తాను రాష్ట్రంలో ఏ జిల్లాలో పనిచేసిన పేదలకు,దళిత బలహీన
వర్గాలకు న్యాయం చేస్తున్నానని ఇకపై కూడా చేస్తానని హామీ ఇచ్చారు
.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు యార్లగడ్డ రవీంద్ర,
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పాలమూరి ధర్మ పాల్, విశాఖపట్నం ఎల్ఐసి
జోనల్ మేనేజర్ పొలమూరి సత్యనారాయణ,
రాష్ట్ర బాబు జగజ్జీవన్ రామ్ ఎంప్లాయిస్ అసోసియేషన్
అధ్యక్షులు మడికి శ్రీరాములు
సొసైటీ డైరెక్టర్లు కాప నాగభూషణం,
చాట్ల సత్యనారాయణ,
తొత్తరమూడి ప్రభాకరరావు,
మోకాటి అమ్మిరాజు
,
మంద వెంకటేశ్వరరావు,
ఉందుర్తి సత్యనారాయణ,
కొడమంచిలి సాయికుమార్ ,
ఈతకోట రాజు తదితరులు పాల్గొన్నారు.

Vijaya Babu. I
Staff Report | Konaseema