అంటే తాను ఉచిత బస్సు ఎక్కి తన పర్సుకు చిల్లు పడకుండా ఎంత ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందగలిగాను అన్నది ప్రతీ మహిళకు కళ్ళారా తెలుస్తుంది.
ANDHRAPRADESH:ఏది చేసినా రిజల్ట్ కావాలి. ఉచితం అంటే దానికి నో వాల్యూ. అందుకే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పధకం అమలు చేయాలనుకుంటూనే కొత్త విధానం అందులో అమలు చేస్తోంది. నిజానికి పొరుగు రాష్ట్రాలలో అమలు అవుతున్న ఉచిత బస్సు పథకంలో నో టికెట్ గానే ఉందని చెబుతున్నారు. కానీ ఆగస్టు 15 నుంచి ఏపీలో అమలు అయ్యే ఉచిత బస్సు పథకంలో మాత్రం టికెట్ ఉంటుంది. కానీ అది జీరో ఫేర్ టికెట్.
ఆ టికెట్ ని కండక్టర్ వారికి ఇస్తారు. ఎక్కడ ఎక్కుతున్నారు, ఎక్కడ దిగుతున్నారు, ఎంత దూరం ప్రయాణిస్తున్నారు. దానికి అయ్యే బస్సు ఫేర్ ఎంత అన్నది అందులో ఉంటుంది. ఉదాహరణకు ఒక మహిళ ఉచిత బస్సు ఎక్కి ఇరవై కిలోమీటర్లు ప్రయాణిస్తే కచ్చితంగా నలభై రూపాయలు అవుతుంది అనుకోండి. ఆ రేటు దాని మీద ముద్రిస్తారు అని అంటున్నారు. ఆ విధంగా ఆమెకు ఫ్రీగా ఇస్తున్న టికెట్ విలువ ఎంతో చెబుతారు.
అంటే తాను ఉచిత బస్సు ఎక్కి తన పర్సుకు చిల్లు పడకుండా ఎంత ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందగలిగాను అన్నది ప్రతీ మహిళకు కళ్ళారా తెలుస్తుంది. అంతే కాదు ఈ ప్రయాణం వల్ల ప్రభుత్వం తమకు చేస్తున్నది కూడా ఎవరూ చెప్పకుండానే అర్ధమవుతుంది. ఈ విధానాన్ని ఏపీలో ఉచిత బస్సులలో ప్రవేశపెట్టనున్నారు.
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు పధకాన్ని అమలు చేసే విషయం మీద చంద్రబాబు అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన ఈ కీలక సూచనలు చేశారు. ఇక ఉచిత బస్సు పధకం జిల్లాలకే పరీతం చేయనున్నారు. అయ్తే అది కొత్త జిల్లాలకా లేక ఉమ్మడి జిల్లాలకా అన్నది ఇంకా తెలియాల్సి ఉందని అంటున్నారు.
అదే సమయంలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి ఎంత వ్యయం అవుతుంది భారం ఏ మేరకు పడుతుంది అన్నది ఆర్టీసీ అధికారులతో సీఎం చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉచిత బస్సు పధకం ఆగస్టు 15 నుంచి కచ్చితంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
అదే సమయంలో ఆర్టీకి భారం కాకుండా విద్యుత్ బస్సులను ఉపయోగించాలని కోరారు. ఇక పైన ఆర్టీసీ కొనే బస్సులు అన్నీ విద్యుత్ ఆధారితంగా నడిచే బస్సులు కావాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న బస్సులు ఎంతవరకూ విద్యుత్ బస్సులుగా కన్వర్ట్ అయ్యేందుకు వీలు ఉంటుంది అన్నది ఆలోచించాలని ఆయన కోరారు.
ఇక ఆర్టీసీ విద్యుత్ బస్సులకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైనా అధ్యయనం చేయాలని చంద్రబాబు కోరారు. రానున్న కాలంలో ఆర్టీసీకి ఆర్ధిక మరింతగ భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం పైన దృష్టి సారించాలని కోరారు. అలాగే , నిర్వహణా వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇక ఆర్టీసీ లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి అన్న దాని మీద అధ్యయనం చేయాలాని అన్నారు. ఆర్టీసీలో ఎటువంటి విధానాలు తీసుకురావాలన్నది మధింపు చేయాలి. దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు ఏది ఏమైనా ఆర్టీసీ ఒక వైపు ఇబ్బంది పడకుండా మరో వైపు ప్రజలకు ఉచిత పధకం అందిస్తూ ఇంకో వైపు లబ్దిదారుల మనసు చూరగొనెలా ఆర్టీసీ రధ చక్రం పరుగులు తీయాలని చంద్రబాబు కోరుతున్నారు. అలా ఆర్టీసీ ముందు బిగ్ టాస్క్ ని ఆయన ఉంచారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi