ANDHRAPRADESH:ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు పై తుది కసరత్తు చేస్తోంది. జూన్ లోనే ఈ పథకం నిధుల జమ చేయాలని భావించారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా తొలి విడత ఈ పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. కేంద్రం ఈ సారి పీఎం కిసాన్ నిధుల విడుదల ఆలస్యం చేసింది. అయితే, ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో లింకు పెట్టటం తో ఇంకా నిధులు జమ కాలేదు. కాగా, ఈ పథకం లబ్దిదారులుగా ఉన్న రైతులకు ఏపీ ప్రభుత్వం కీలక సూచన చేసింది. లబ్దిదారుల అంశం పైన తాజాగా స్పష్టత ఇచ్చింది.
నిధుల జమ
చాలా రోజులుగా పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల కోసం వేచి చూస్తున్న రైతుల ఖాతాల్లో నిధుల జమకు ముహూర్తం ఖరారైంది. ఈ వారంలోనే విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. ఇటు ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఈ పథకం కోసం అర్హుల జాబితాను దాదాపు ఖరారు చేసారు. అభ్యంతరాల పైన రైతులకు అవకాశం కల్పించారు. దీంతో, రెండు పథకాలు ఒకే సారి అమలు చేస్తే రైతుల ఖాతాల్లో రూ 7 వేలు జమ కానున్నాయి. ఈ నెల20వ తేదీనే తొలుత నిధుల విడుదల అవుతాయని భావించారు. కాగా, ఇప్పుడు కొంత ఆలస్యం కానున్న ట్లు తెలుస్తోంది.
రైతులకు లాస్ట్ ఛాన్స్
కాగా, ఏపీ వ్యవసాయ శాఖ ఈ పథకం లబ్దిదారుల కోసం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం లబ్ది దారుల జాబితాలు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. జాబితాలో పేరే లేకపోతే ఈ నెల 23 లోగా అర్హులైన రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్ లో వివరాలు నమో దు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు సూచించారు. ఈ పథకానికి అర్హులెవరూ మిగిలి పోకూడదనే ప్రభుత్వ ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పథకం లో తమ అర్హత స్థితిని టోల్ ఫ్రీ నెంబర్155251 లో రైతులు తెలుసుకోవచ్చని చెప్పారు. అదే విధం గా 9552300009 కు తమ ఆధారం నంబరు పంపి కూడా రైతు అర్హత వివరాలు తెలుసుకోవ చ్చని వివరించారు. పీఎం కిసాన్ ద్వారా వచ్చే రూ 2 వేలకు ఏపీ ప్రభుత్వం రూ 5 వేలు చొప్పున రెండు సార్లు, రూ 4 వేలు చివరి విడతలో కలిసి ఇవ్వనుంది.
చెక్ చేసుకోండి
అదే విధంగా పీఎం కిసాన్ నిధులు ఖాతాలో జమ కావాలంటే e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవటానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్ఓపెన్ చేసి, Know Your Status అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేసి, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు Get OTP ఆప్షన్పై క్లిక్చేస్తే మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్చేస్తే స్క్రీన్పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ - కేవైసీ చేయించలేదని భావిస్తారు. దీంతో, ప్రతీ లబ్దిదారుడికి ఈ విధానం తప్పని సరి చేసారు. దీంతో.. ఈ నెలాఖరులోగా పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi