HYDERABAD:తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ మండలాల వారీగా చేయాలని డిసైడ్ అయింది. ఇందు కోసం ముహూర్తం ఖరారు చేసింది. అదే సమయం లో రేషన్ కార్డుల దారులకు సంక్షేమ పథకాల అమలు విషయంలో సూచనలు చేసింది. రేషన్ కార్డు లు లేక పథకాలకు చాలా మంది దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూ రు చేస్తుండటంతో లబ్ధిదారులకు పథకాల లబ్దిదారులుగా మారనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో భాగంగా పలు పథకాలను ఇప్పటికే అమలు చేస్తోంది. ముఖ్యంగా మహాలక్ష్మిలో రూ.500కు వంట గ్యాస్, గృహ జ్యోతిలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు వంటి వాటివి అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ పథకాల అమలుకు రేషన్ కార్డు తప్పని సరి చేసింది. అయితే, రేషన్ కార్డులు లేక పథకాలకు దూరంగా ఉన్న వారికి ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనాలు దక్కనున్నాయి. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
తాజాగా సీఎం రేవంత్ వర్షాలు, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రాజెక్టుల్లో నీటి వినియోగం, రేషన్ కార్డులపై కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టర్లు కచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. సన్న బియ్యం పంపిణీతో రేషన్ షాపులు, కార్డులకు డిమాండ్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మనిషికి 6 కిలోల చొప్పున 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇక, కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించింది. దీంతో లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi