అమెరికాలోని బర్మింగ్ హామ్ లో వరల్డ్ పోలీస్ గేమ్స్-2025
టెన్నిస్ లో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ గెలిచిన టీటీడీ విజిలెన్స్ అధికారులు సురేంద్ర, రామ్ కుమార్
ఘనంగా సన్మానించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
ANDHRAPRADESH:తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) విజిలెన్స్ అధికారులు ఎ. సురేంద్ర, ఎన్.టి.వీ. రామ్ కుమార్ లు అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రపంచ పోలీస్ క్రీడల-2025లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. వారిద్దరినీ నేడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఘనంగా సన్మానించారు.
ఈ అధికారులు టెన్నిస్‌లో బంగారు, కాంస్య పతకాలను సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని బీఆర్ నాయుడు అభినందించారు. ఎ. సురేంద్ర 45 ప్లస్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం, ఎన్.టి.వీ. రామ్ కుమార్ 55 ప్లస్ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించారు. ప్రపంచ పోలీస్ క్రీడల్లో 80 దేశాల నుంచి 9,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ పోటీల్లో టీటీడీ అధికారులు కూడా పాల్గొని విశేషంగా రాణించారు. ఈ విజయం టీటీడీ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని బీఆర్ నాయుడు అన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi