చింతలపూడి ఆయన ఇంటివద్ద ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. మీరు అధికారంలో ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర గారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి జైలు పంపించారని అన్నారు. ఆ కుంభకోణంలో ఆ రోజున సిట్ అనేకమందిని ప్రశ్నించి అనేక ఆధారాలను సేకరించి మిధున్ రెడ్డిని అరెస్టు చేసిందని తెలిపారు.
చంద్రబాబు నాయుడు గారిపై అసత్యపు ప్రచారాలు అసత్యపు మాటలు మాట్లాడుతున్నారని ఇది తగదు అని హితవు పలికారు. మీ ఐదు సంవత్సరాల పాలనలో బాబు గారిపై అనేక అక్రమకేసులు పెట్టినా.. ఒక్క కేసులో కూడా ఆధారాలను చూపలేకపోయినారని గుర్తు చేశారు. ఈరోజున మీరు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటకు రావడంతో ముసలకన్నీరు కారుస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కొమ్మరాజు సత్యనారాయణ ధ్వజమెత్తారు.