Hot Posts

6/recent/ticker-posts

సంక్షేమంలో చంద్రబాబు మనసుకు దగ్గరైన కార్యక్రమం ఏంటో తెలుసా!

ANDHRAPRADESH:ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడానికి పీ4 అనే కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తించి వారి జీవితాలను చేంజ్ చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. పీ4.. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్ షిప్. అంటే ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం.

పీ4 గేమ్ చేంజర్

నిరుపేద కుటుంబాలను పైకి తీసుకురావడం కోసం అత్యంత సంపన్నులైన 10శాతం మంది,పేద కుటుంబాలలో అట్టడుగున ఉన్న 20శాతం మందికి నేరుగా సహాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్ ను సాకారం చేసేందుకు చంద్రబాబు ఆలోచనలలో నుంచి వచ్చిన ఓ గేమ్ చేంజర్ పీ4. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం అమలు కోసం ప్రస్తుతం ఏపీలో అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు.

పీ4 పథకం సంక్షేమానికి అదనం 

తాజాగా పీ 4 పథకం పైన కీలక విషయాలు చెప్పిన చంద్రబాబు పీ4 పథకం సంక్షేమానికి అదనమని, దీనివల్ల సంక్షేమ పథకాలలో కోత ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పథకం పైన ప్రజలలో అపోహలను తొలగించాలని కూడా ఆయన సూచించారు. బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం అందించేలా, నిరంతరం గైడెన్స్ ఇచ్చేలా ఉండడమే మార్గదర్శులు బాధ్యతగా తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు,

లక్షమంది మార్గదర్శులు ప్రస్తుతం పీ4 అమలులో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు, లక్షమంది మార్గదర్శులను గుర్తించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.పేదలకు సహాయం చేసేందుకు సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కోరిన ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసిన పీ 4 మాత్రం తన మనసుకు దగ్గరైన కార్యక్రమం అని స్వయంగా చెప్పారు.

చంద్రబాబు కోరిక అదే.. అందుకే పీ4 మనసుకు దగ్గరైన కార్యక్రమం

నిరుపేదలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూడాలన్నదే తన ఆకాంక్ష అని రాష్ట్రంలోని పేదలను ఆదుకోవాలని అదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. అందుకే పీ 4 అన్నిటికంటే తన మనసుకు దగ్గరైన కార్యక్రమమని చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఎందుకంటే పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడానికి ప్రస్తుతం తాము చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తే అది ప్రపంచానికే దిక్సూచిగా మారుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi