ANDHRAPRADESH:ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి కేంద్రంగా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం మరో కీలక ఆదేశాలు ఇచ్చింది. రాజధాని అమరావతిలో భూములు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూముల్లేని 1,575 పేద కుటుంబాలకు పెండింగ్ లో ఉన్న పెన్షన్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజధాని అమరావతిలో భూముల్లేని 1,575 పేద కుటుంబాలు పెన్షన్లు పొందనున్నాయి. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన వారికి కొత్త పెన్షన్ల మంజూరు పైన కసరత్తు కొనసాగుతోంది.
ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అయిదు లక్షల మందికి కొత్తగా ఇవ్వాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ నెలా రూ 4 వేల పెన్షన్ ను ఒకటో తేదీన లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవటంతో కొత్తగా పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. అదే సమయంలో దివ్యాంగ పెన్షన్లలో పలువురి అనర్హులు పొందుతున్నట్లు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు అందాయి.
ఇక, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని తాజాగా టీడీపీ ఎమ్మెల్యే తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో పలువురు తమకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. అదే విధంగా వైసీపీ ప్రభుత్వంలో పెద్ద మొత్తంలో అర్హులు పెన్షన్లు పలు రకాల కారణాలతో కోల్పోయారు. వారంతా తమకు తిరిగి అవకాశం కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తున్నారు. కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత దరఖాస్తులు స్వీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే.. ఇప్పుడు అమరావతిలోని భూమి లేని పేదలకు పెన్షన్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులకు పెన్షన్ల మంజూరు పైన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi