Hot Posts

6/recent/ticker-posts

పేర్ని నాని ఆడియో కాల్ లీక్, ఉక్కిరి బిక్కిరి - తాజా నిర్ణయంతో..!!


ANDHRAPRADESH:ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ - వైసీపీ మధ్య కొత్త రాజకీయం మొదలైంది. వైసీపీ ముఖ్య నేతలు వివాదాస్పద వ్యాఖ్యల పై కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వీటి పైన టీడీపీ ఫిర్యాదు తో కేసు నమోదైంది. ఇక.. గుడివాడలో చోటు చేసుకున్న తాజా పరిణామాల వేళ పేర్ని నాని మాట్లా డిన ఆడియో కాల్ వైరల్ అవుతోంది. దీంతో.. పేర్ని నాని రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి అవుతు న్నారు. కేసు విషయంలో పోలీసుల తదుపరి చర్యలు ఉత్కంఠ పెంచుతున్నాయి.

మాజీ మంత్రి పేర్ని నాని తాజా ఆడియో కాల్ వివాదాస్పదంగా మారింది. ఆయన ఫోన్ సంభాషణ లీక్ కావటంతో గుడివాడ రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. లోకేష్ డైరెక్షన్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యే వివాదం చేశారని ఏపీవ్యాప్తంగా ఆందోళన చేయించాలని ఫోన్ కాల్‌లో పేర్నినాని తమ పార్టీ నేతలకు చెప్పిన అంశం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఇప్పటికే పేర్ని నాని పామర్రు మీటింగ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలో కేసు నమోదు చేశారు. ఈ వివాదం కొనసాగు తున్న సమయంలో కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌ పర్సన్‌ హారికపై టీడీపీ గూండాలు దాడి చేశారంటూ పేర్నినాని తీవ్రంగా విమర్శించారు. హత్యాయత్నం చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపణలు గుప్పించారు.

టీడీపీ గూండాల దాడికి పోలీసులు రక్షణగా ఉన్నారన్నారు పేర్ని నాని. పోలీసుల సమక్షంలో దాడి జరిగితే ఇది సైకో పాలన కాదా? అంటూ నాని ప్రశ్నించారు. దాడి, హత్యాయత్నంపై హారిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం దాడి చేసిన వారిపై చర్యలుతీసుకుంటుందనే నమ్మకం లేదని అన్నారు. కాగా.. పేర్ని నాని వ్యాఖ్యల పైన మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నాని బియ్యం దొంగ అంటూ కొల్లు మండిపడ్డారు. ప్రభుత్వంపై కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వంపై బురద ల్లుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi