స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటుపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని సతీశ్ తన తల్లి వినోద(60)తో కొన్నిరోజులుగా డబ్బు విషయంలో గొడవపడ్డాడు. ఈ రోజు తెల్లవారుజామున మరోసారి గొడవ జరగగా.. సతీశ్ తీవ్ర ఆగ్రహంతో తల్లిపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. మంటలు అంటుకుని బాధతో వినోద అరవడంతో సతీశ్ పారిపోయాడు. వినోద అరుపులు విని చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వచ్చి మంటలు ఆర్పారు.
అంబులెన్స్ కు ఫోన్ చేసి వినోదను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి 80 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యుులు తెలిపారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. నిందితుడు సతీశ్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi