మారుతున్న కాలానుగుణంగా రాజకీయాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడే మాధ్యమంగా సోషల్ మీడియా కీలకంగా మారింది. రాజకీయ నాయకులు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటిపై స్పందిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలా ప్రజల గళానికి స్పందిస్తున్న ప్రముఖుల్లో ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ పేరు ముందు వరుసలో నిలుస్తోంది. తాజాగా ఓ సామాన్య పౌరుడి ట్వీట్‌కు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం ఆయన చొరవకు నిదర్శనంగా నిలిచింది.
పార్వతీపురం జిల్లా బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌కు చెందిన విద్యార్థులను రాజకీయ నిరసనలో పాల్గొనడానికి తీసుకెళ్లిన ఘటనపై, ఒక సామాన్య వ్యక్తి శ్యామ్ ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్‌కి విన్నవించాడు.
రవనీయులైన విద్యాశాఖా మంత్రి లోకేష్‌కు.. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌లో జరిగిన ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిన్న స్కూల్ యూనిఫారమ్‌లో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే ఒకరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు తీసుకెళ్లారు. ఇది మాత్రమే కాదు, హెడ్‌మాస్టర్, ఎంఈవో రాజకీయ నిరసనకు అనుమతించారు. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ బాధ్యతారాహిత్యానికి తగిన చర్యలు తీసుకోవాలి అని కోరారు.
శ్యామ్ చేసిన ట్వీట్‌పై తక్షణమే స్పందించిన AP విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో, విద్యార్థుల భద్రతను పణంగా పెట్టిన అధికారులు, రాజకీయ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.