Hot Posts

6/recent/ticker-posts

బాబుకు దండం పెట్టాల్సిందే...వారంతా లక్కీ !


ఇలా సామాజిక పెన్షన్ల లో ఏపీకి మించినది లేదు. అంతే కాదు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఠంచనుగా ప్రతీ నెలా ఒకటవ తారీఖున పెన్షన్లు ఇస్తున్నారు.

ANDRAPRADESH:ప్రభుత్వాలు చేసిన వాటిలో మంచి ఉంటే మంచి చెప్పుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో చేస్తున్న మంచి పనులలో అతి ముఖ్యమైనదిగా ఉన్నది ఒకటి. అది సామాజిక పెన్షన్లు. వృద్ధులకు ఏకంగా నెలకు నాలుగు వేల రూపాయలను ఎకా ఎకీగా చంద్రబాబు పెంచేశారు. నిజానికి చూస్తే ఏపీ చరిత్రలో పెన్షన్లను ఒకేసారి నాలుగైదు రెట్లు పెంచిన వారుగా చంద్రబాబునే చెప్పాలి.

ఇక ఆయన 2024 ఎన్నికల ముందు ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచినవి అమలు చేస్తామని చెప్పి ఆ మూడు వేలతో కలిపి 2024 జూలై 1వ తేదీన ఏకంగా ఏడు వేల రూపాయలను ఒకేసారి వారి ఖాతాలో వేశారు. ఈ పెన్షన్లతో పాటు కిడ్నీ పేషంట్లకు ఇతర వికలాంగులకు ఇంత కంటే ఎక్కువగా పెన్షన్ ఇస్తున్నారు.

ఇలా సామాజిక పెన్షన్ల లో ఏపీకి మించినది లేదు. అంతే కాదు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఠంచనుగా ప్రతీ నెలా ఒకటవ తారీఖున పెన్షన్లు ఇస్తున్నారు. ఒకవేళ ఆ రోజు ఆదివారం అంటే 31న ఇస్తున్నారు. ఇలా చేస్తున్న ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉంది అంటే అది ఒక్క చంద్రబాబు ప్రభుత్వమే అని చెప్పాల్సి ఉంది.

ఇదంతా ఎందుకు అంటే బీహార్ లో తాజాగా అక్కడి నితీష్ కుమార్ ప్రభుత్వం సామాజిక పెన్షన్లను భారీగా పెంచిందని వార్త వచ్చింది. మరి ఎంత పెన్షన్ పెంచి ఉంటారో అని చూస్తే కనుక సామాజిక భద్రతా పింఛను పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు వితంతువులందరికీ ఇప్పుడు నెలకు ఇస్తున్న 400 రూపాయలకుబదులుగా 1100 రూపాయలు పింఛను పెంచారన్న మాట.

పైగా ఇది కూడా ప్రతినెలా 10వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఏపీలో పెన్షన్లతో పోలిస్తే ఈ రోజుదాకా పదవ వంతుగానే బీహార్ లో ఇస్తున్నారు అన్న మాట. ఇపుడు పెంచిన పెన్షన్ తీసుకున్నా అది నాలుగవ వంతు అవుతుంది.

పైగా ప్రతీ నెలా ఒకటవ తేదీ కాదు పదవ తేదీకి ఇస్తున్నారు. అదే ఏపీలో అయితే ఠంచనుగా ఒకటవ తేదీకే చంద్రబాబు ఇస్తున్నారు. మరి బాబు ప్రభుత్వం చేస్తున్న ఈ మంచిని ఏపీలోని వృద్ధులు కానీ వితంతువులు కానీ ఇతర వర్గాలు కానీ పూర్తిగా అర్ధం చేసుకుని సమాదరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మాత్రమే ఉంది. నిధుల కొరత ఉంది. అప్పులు ఉన్నాయి. కానీ రాజధాని రూపేణా ఆదాయం రాకున్నా ఏపీలో పెన్షన్లు ఒక జీతంగా ఇస్తున్నారు అంటే శభాష్ అని చెప్పాల్సి ఉంటుంది. అంతే కాదు నెలలో మొదటి తారీఖుకే ఇస్తున్ననందుకు చప్పట్లు కొట్టి మరీ అభినందించాలి.

ఇక ఈ మధ్యనే పెన్షన్ పంపిణీ వేళ బాబు ఒక మాట అన్నారు. ఆ దేవుడి దయ ఉంటే ఈ పెన్షన్ కూడా మరింతగా పెంచుతాను అని. అంటే ఆయన మదిలో అయిదు వేల రూపాయలు పెన్షన్ చేయాలని ఉందని అంటున్నారు. ఇవన్నీ చూసినపుడు ఏపీలో వృద్ధులు సేఫ్ పొజిషన్ లో ఉన్నారనే చెప్పాల్సి ఉంది. ఇలా అధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న బాబు ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సి ఉంది.


WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now