అక్కడ నిజానికి కాంగ్రెస్ గతంలో బలంగా ఉండేది. 2014 తరువాత నుంచి వైసీపీ జెండా పాతేసింది.
ANDRAPRADESH:ఏపీలో కీలకమైన రీజియన్లలో వైసీపీ బలహీనంగా ఉంది. ఏడాది పాలన తరువాత ఒక్కసారి చూసుకుంటే కనుక వైసీపీ గ్రాఫ్ ఎంత మేరకు పెరిగింది అంటే రాయలసీమలో మాత్రం కొంత మేరకు బలపడింది అని అంటున్నారు. అదే సమయంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో యధాతథ పరిస్థితి కొనసాగుతోంది అని అంటున్నారు.
అక్కడ నిజానికి కాంగ్రెస్ గతంలో బలంగా ఉండేది. 2014 తరువాత నుంచి వైసీపీ జెండా పాతేసింది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ తిరగడం లేదు. సీన్ కూడా రివర్స్ అయింది. ఇక ఏపీకి నడిబొడ్డున ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాలు రాజధాని జిల్లాలు, చైతన్యం ఎక్కువ ఉన్న ప్రాంతాలు. ఇక్కడ వైసీపీకి ఇంకా ఉనికి పోరాటం తప్పడం లేదు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఈ రెండు జిల్లాలలో జనసేన టీడీపీ కాంబో స్ట్రాంగ్ గా ఉండి. వైసీపీకి ఏ మాత్రం చోటివ్వడం లేదు అని అంటున్నారు
ఇక ఏపీలో ప్రభుత్వం మార్పులో ఎపుడూ కీలక పాత్ర పోషించే ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలలో వైసీపీకి ఎదురీతే అని అంటున్నారు. నిజం చెప్పాలీ అంటే ఇక్కడ కూటమిలో వర్గ పోరు ఉంది. ఐక్యత లేకుండా ఉంది. అలాగే టీడీపీ సీనియర్లను పక్కన పెట్టడం వల్ల వారంతా నైరాశ్యంతో ఉన్నారు. అయిన సరే పరిస్థితిని సొమ్ము చేసుకునే స్థితిలో మాత్రం వైసీపీ లేదు.
వైసీపీ విషయానికి వస్తే దిగ్గజ నేతలు ఎందరో ఉన్నారు. వారంతా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కీలక శాఖలను చూశారు. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వంటి రాజ్యాంగ బద్ధమైన పదవులు నిర్వహించారు. కానీ ఇపుడు అంతా సైలెంట్ అయ్యారు.
ఏడాది పాలన కూటమి పూర్తి చేసుకుంది మెల్లగా యాంటీ ఇంకెంబెన్సీ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నోరు విప్పాల్సిన వారు మౌనంగా ఉంటున్నారు. అంతే కాదు పార్టీకి పట్టకుండా ఉంటున్నారు. పోనీ వారికి ఏమైనా ప్రాధాన్యత తక్కువా అంటే వారికి కీలక పార్టీ పదవులను అప్పగించారు. సీనియర్లను తీసుకుని వెళ్ళి వైసీపీలో అత్యున్నత రాజకీయ వేదిక అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెంబర్స్ గా చేశారు.
ఇంత చేసినా కూడా ఎవరూ అంగుళం కదలడం లేదు. మాకెందుకొచ్చిన బాధ అని భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఈ మధ్య కాలంలో వైసీపీ పలు ఆందోళనలకు పిలుపు ఇచ్చింది వెన్నుపోటు దినం అని కూడా నిర్వహించింది. అయితే ఏవి చేసినా కూడా సీనియర్ల నుంచి స్పందన అయితే పెద్దగా లేదని అంటున్నారు.
మరి నాలుగేళ్ళ పాటు ఏపీలో కూటమి అధికారంలో ఉంటుందని ఇపుడు ఎందుకొచ్చిన ఆయాసం అని భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయని అంటున్నారు మరి పార్టీ పుంజుకోవాలీ అంటే నేతలు కదలాలని అంటున్నారు. ఆ దిశగా అయితే ఎవరూ ముందుకు రావడం లేదు. దాంతో ఇటీవల కాలంలో అధినాయకత్వానికి వస్తున్న నివేదికలు చూస్తే కనుక ఉత్తరాంధ్రాలో వైసీపీ వెరీ వీక్ అని తెలుస్తోందిట.
దాంతో నాయకత్వంలో మార్పులు చేస్తారా లేక మరేమైనా రిపేర్లు చేస్తారా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ అధినాయకత్వం ఇపుడు ఉత్తరాంధ్ర మీద బెంగ పెట్టుకుందని అంటున్నారు. మరి ఏ రకమైన మరమ్మత్తులు చేస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.