ANDRAPRADESH: ఒక జాతీయ చానల్ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూలో వచ్చిన ఈ ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా లోకేష్ ఎపుడు అవుతారు. ఈ ప్రశ్న టీడీపీలో జూనియర్లను ఎంతగానో వేధిస్తున్నది. అంతే కాదు ఆయన సాధ్యమైనంత త్వరగా సీఎం కావాలని వారికి బలంగా ఉంది. అయితే ముఖ్యమంత్రి సీటు అయితే ఖాళీగా లేదు. పైగా అక్కడ ఉన్నది యాభై ఏళ్ల రాజకీయ అనుభవం నిండుగా ఉన్న చంద్రబాబు.
ఆయన నాలుగవ సారి సీఎంగా ఉన్నారు. ఇక ఏపీలో చూస్తే అనేక సవాళ్ళు విభజన రాష్ట్రానికి ఉన్నాయి. మరో వైపు చూస్తే కూటమిగా ప్రభుత్వం నడుస్తోంది. టీడీపీకి సొంతంగా 135 దాకా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మిత్రులతో కలసి నడవాలన్న టీడీపీ భవిష్యత్తు ఆలోచనలు అన్నీ ముడిపడి ఉండడంతో ఆ వైపు నుంచి వచ్చే పర్యవసానాలు పరిణామాలను బేరీజు వేసుకోవాల్సి ఉంది.
ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉంది లోకేష్ పట్టాభిషేకం. అయితే ఏమీ కాకుండా ఇదే ప్రశ్నను వేశారు, ఒక జాతీయ చానల్ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూలో వచ్చిన ఈ ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ చానల్ అడిగింది ఏంటి అంటే లోకేష్ ని ఎపుడు టీడీపీ ప్రెసిడెంట్ గా చేయబోతున్నారు, అలాగే 2029 ఎన్నికల్లోగా లోకేష్ ని సీఎం గా చేస్తారా. అంటే బాబు జవాబిస్తూ లోకేష్ కి టీడీపీతో పాటు ప్రజల మద్దతు పూర్తిగా ఉందని అన్నారు.
ఇక యువతను ప్రోత్సహించడంలో టీడీపీ ఎపుడూ ముందుందని తన పార్టీకి కేంద్ర మంత్రిగా అతి పిన్న వయస్కుడు అయిన రామ్మోహన్ నాయుడు ఉన్నారని గుర్తు చేశారు. అలాగే టీడీపీ పార్లమెంట్ ఎంపీలల్లో అత్యధిక శాతం యంగ్ స్టర్స్ అన్నారు. అలాగే ఏపీలో అసెంబ్లీ యూత్ అసెంబ్లీగా అభివర్ణించారు. అందువల్ల యువత రాజకీయ అవకాశాలు అందుకోవడం ఒక పరిణామ క్రమంగా జరుగుతుందని చెప్పారు.
ఇక ఎన్టీఆర్ తరువాత తాను సీఎం కావడం తన తరువాత లోకేష్ పేరు వినిపించడం మీద బాబు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో నామినేట్ చేయడం కుదరదని అన్నారు. ప్రజల అనుమతి ఉండాలని అన్నారు. తనకు నాలుగు సార్లు సీఎం గా ప్రజలు అవకాశం ఇచ్చారని అంటూ లోకేష్ కి కూడా జనాల మద్దతు ఉందన్న మాటను బాబు చెప్పకనే చెప్పేశారు.
అయితే లోకేష్ ఎపుడు ముఖ్యమంత్రి అవుతారు అన్నది ఆయన చెప్పలేదు. పైగా జనరలైజ్ చేస్తూ మాట్లాడారు. టీడీపీ యూత్ పార్టీగా పరిణామ క్రమంగా విస్తరిస్తూ ముందుకు సాగుతోంది అన్నారు. ఇక లోకేష్ కి పార్టీ మద్దతు ప్రజల మద్దతు పూర్తిగా ఉందని బాబు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అయితే ఆయన అనుచరులలో అభిమానులలో ఆనందం కలిగేలా చేస్తున్నాయి.
కాస్తా అటూ ఇటు కావచ్చు, ఆలస్యం అయినా కావచ్చు కానె లోకేష్ కచ్చితంగా ఏదో నాటికి సీఎం అవుతాడు అన్నది అంతా భావిస్తున్నారు. అయితే వ్యూహకర్తగా బాబు నుంచి సూటింగా జవాబు ఎవరూ ఆశించలేరు కానీ లోకేష్ కి మద్దతు ఉందని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో లోకేష్ బాబు సీఎం పదవికి దగ్గరగా వస్తున్నారు అన్నది మాత్రం అర్ధం అవుతోంది అంటున్నారు.