Hot Posts

6/recent/ticker-posts

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సందర్శించిన కోట రామ ప్రసాద్


విశాఖపట్నం: విశాఖపట్నం సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంను తూర్పు గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, పాలంగి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ & సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ సందర్శించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో అధికారులను కలిసి తాను ఇటీవల రచించిన "యోగా గేయం" గురించి వివరించారు. 

ఆ గేయ ప్రతులను కూడా రేడియో స్టేషన్ అధికారులకు అందజేసి, ఆ గేయాన్ని పరిశీలించి, సినీ గాయనీ గాయకులు పాడిన ఆ గేయాన్ని జూన్ 21 "అంతర్జాతీయ యోగా దినోత్సవం" సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారం చేయమని కోట రామ ప్రసాద్ కోరారు.


ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రోగ్రాం ఆఫీసర్ కె. ఇందిర ను కోట రామ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. "యోగా గేయం" యొక్క ప్రతిని ఈ సందర్భంగా వారికి కోట రామ ప్రసాద్ సమర్పించారు. యోగా కార్యక్రమం సమయం చాలా దగ్గరగా ఉన్న కారణంగా ఇప్పుడు ఈ గేయాన్ని ప్రసారం చేయలేమనీ, ఈ గేయాన్ని సంబంధిత అధికారికి పంపి ఈ గేయాన్ని పరిశీలించమని కోరతామని కె. ఇందిర కోట రామ ప్రసాద్ కు తెలియజేశారు. 

ఏదైనా గేయం ప్రసారం చెయ్యాలి అంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయనీ, ఆ నిబంధనలు అన్నీ సంతృప్తి చెందినప్పుడు మాత్రమే ప్రసారం చెయ్యడానికి వీలు అవుతుందని ఈ సందర్భంగా కె. ఇందిర కోట రామ ప్రసాద్ కు వివరించారు. భవిష్యత్తులో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారం చేయబోవు అనేక కార్యక్రమాలలో కోట రామ ప్రసాద్ ప్రసంగించే అవకాశాలు కల్పిస్తామని కోట రామ ప్రసాద్ కు కె. ఇందిర హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డ్యూటీ ఆఫీసర్ టి.దిలీప్ ను కూడా కోట రామ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి తమ "యోగా గేయం" యొక్క ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా టి.దిలీప్ కోట రామ ప్రసాద్ ను ప్రోత్సహిస్తూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో జరిగే అనేక కార్యక్రమాలలో భవిష్యత్తులో కోట రామ ప్రసాద్ రచనలకు, ప్రసంగాలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డ్యూటీ ఆఫీసర్ టి.దిలీప్ కు కోట రామ ప్రసాద్ సినీ గాయనీగాయకులు పాడిన "యోగా గేయం" ను వారి వాట్స్ అప్ కు పంపి, వారి అమూల్యమైన అభిప్రాయం తెలియజేయవలసినదిగా కోట రామ ప్రసాద్ డ్యూటీ ఆఫీసర్ టి.దిలీప్ ను కోరారు.

తమ యోగా గేయాన్ని విని తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, సాంస్కృతిక, పర్యాటక శాఖామాత్యులు కందుల దుర్గేష్, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ప్రభృతులు అభినందించారని ఈ సందర్భంగా కోట రామ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అధికారులకు వివరించారు.

ఈ సందర్భంగా కోట రామ ప్రసాద్ మాట్లాడుతూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చూడాలనే తమ చిరకాల కోరిక ఈనాడు తీరిందని తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోట రామ ప్రసాద్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో డ్యూటీ ఆఫీసర్ టి.ప్రదీప్ తోనూ, వ్యతిగతంగా తాను ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో కొన్ని ఫోటోలు దిగారు.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now