Hot Posts

6/recent/ticker-posts

2025, జూన్ 21 వ తేదీ : "అంతర్జాతీయ యోగా దినోత్సవం" సందర్భంగా వ్రాసిన యోగా గేయం

గేయ రచయిత కోట రామ ప్రసాద్

🌹పల్లవి🌹

యోగ భారతమా ! ఆరోగ్య వర ప్రసాదమా !! దివ్య భవ్య ఆంధ్ర తేజమా ! దేశ విదేశ దిశా నిర్దేశమా !!            

🌷చరణం 1🌷

యోగ సాధనే మన గమ్యమై కదులుదామా !

ఆరోగ్యం మన లక్ష్యమై కదనుతొక్కుదామా !!

శ్వాసమీద ధ్యాస నిలుపుదామా !   

ప్రాణాయామంతో ప్రశాంత మనసు పొందుదామా !!

||యోగ||  

            

🌷చరణం 2 :🌷

తెల్లవారక ముందే మధురమైన నిదుర లేద్దామా !       

ప్రకృతి పనులు వేగమే నెరవేరుద్దామా !!

యోగులై యోగ సాధన చేద్దామా !

యోగసాధకులై ఆరోగ్యవంతులవుదామా !!

||యోగ"||

 

🌷చరణం 3🌷

ప్రపంచానికే చుక్కాణి వై నిలిచిన ఓ నవ భారతమా !

వసుధకే గురువై యోగా నేర్పిన మార్గదర్శి వైనావా !! 

జూన్ ఇరువది ఒకటి సమస్త భూమండలం సంతోషంతో నిండునుగా !

యోగా సాధనతో, ఆసనాల ఆచరణతో ఆరోగ్యం పండునుగా !!                                  

||యోగ||


🌷చరణం 4🌷

"స్వర్ణాంధ్ర", "యోగాంధ్ర" మన చంద్రబాబు సుందర స్వప్నమై నిలువగా !

భారత మహిళల సింధూరమే ఆపరేషన్ సింధూర్ గా, ఉగ్రమూకల చెందాడిన మోడీకి అండగా ఉండగా !! మిత్రులారా ! 

కదలి రండి మన విశాఖకు మీ హృదయాల ఆనందం పండగా ! జూన్ ఇరువది ఒకటి గిన్నీసు బుక్ లో పదిల పరచగా !!

కదను తొక్కుతూ, పదం పాడుతూ, కదలి రండి మీరంతా ! జనసంద్రమై విశాఖ నిలువగా !!!

||యోగ||


✍️రచన : కోట రామ ప్రసాద్, 

రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, 

పాలంగి గ్రామం, 

ఉండ్రాజవరం మండలం, 

తూర్పు గోదావరి జిల్లా, 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. 

వాట్స్ అప్ నెంబర్ : 93475 03536


 

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now