AMARAVATHI: అమరావతిలో ప్రధాని పర్యటన ముగిసింది. అమరావతి రీ లాంఛ్ తో సహా పలు కార్యక్రమాలకు ప్రధాని మోదీ వర్చ్యువల్ గా శంకుస్థాపన చేసారు. అమరావతి భవిష్యత్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పైన తన అంచనాలను వెల్లడించారు. కలిసి పని చేసి లక్ష్యాలను చేరుకోవా లని సూచించారు. కాగా, ఈ సభకు పలువురు ప్రముఖులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిం చింది. ఆ జాబితాలో మాజీ సీఎం జగన్ తో సహా చిరంజీవి ఉన్నారు. జగన్ గైర్హాజరు అయ్యారు. కాగా, చిరంజీవి రాకపోవటం వెనుక ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది.
చిరంజీవికి ఆహ్వానం అమరావతి లో ప్రభుత్వం ప్రధాని సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ప్రధాని అమరావతి పర్యటన వేళ కూటమి నేతల్లో జోష్ కనిపించింది. కాగా, ఈ సభకు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకం గా ఆహ్వనించినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరిగింది. కొంత కాలంగా ప్రధాని మోదీతో చిరంజీవి ఏర్పడిన అనుబంధంతో ఈ సభకు చిరంజీవి హాజరు అవుతారని అందరూ భావించారు. ఏపీలో చంద్రబాబు - పవన్ ప్రమాణ స్వీకార వేదిక పైన చిరంజీవికి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. మెగా బ్రదర్స్ తో కలిసి చేతులు పైకెత్తి అభివాదం చేసారు. ఆ తరువాత ఢిల్లీలో జరిగిన కార్యక్రమాల్లో మోదీతో కలిసి చిరంజీవి వేదిక పంచుకున్నారు.
సోషల్ మీడియాలో చర్చ కాగా, చిరంజీవి ఈ సభకు వస్తారని అందరూ భావించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనూ భీమవరంలో అల్లూరి శతజయంత్యుత్సవాలు సందర్బంగా ఆయన విగ్రహావిష్కరణకు ప్రధాని రాగా, ఆ వేదికపై మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. చిరంజీవి బీజేపీకి దగ్గరవుతు న్నారనే ప్రచారం సాగింది. అయితే, చిరంజీవి మాత్రం రాజకీయంగా తిరిగి తాను యాక్టివ్ అయ్యేది లేదని తేల్చి చెప్పారు. తమ్ముడు పవన్ కు మద్దతుగా కొనసాగుతున్నారు. చంద్రబాబు పైనా తాజాగా చిరంజీవి చేసిన ప్రశంసల పైన చర్చ జరిగింది. ఇక, అమరావతికి చిరంజీవి ఆహ్వానం వేళ సోసల్ మీడియాలో పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. నాడు అమరావతి లో భూ సమీకరణ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ అయ్యాయి.
అసలు కారణం జగన్ నాడు ప్రతిపాదించిన మూడు రాజధానుల ఆలోచనను చిరంజీవి ఆ సమయంలో సరైన నిర్ణయంగా పేర్కొన్నారు. అమరావతి కోసం రైతుల నుంచి భూ సేకరణ సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. దీంతో, ఇలాంటి వ్యక్తిని అమరావతి వేడుకకు ఎలా పిలుస్తారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపించాయి. అమరావతి సభకు చిరంజీవి రాకపోవటం పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా భావించి ప్రధానిని ఆహ్వానించి అమరావతి సభ నిర్వహించింది. ఈ సభకు హాజరు కాకపోయినా.. చిరంజీవి సోషల్ మీడియా వేదికగానూ ఈ సభ గురించి ఎక్కడా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ముంబాయిలో జరిగిన వేవ్స్ సదస్సు లో చిరంజీవి పాల్గొన్నారు. దీంతో, చిరంజీవి సభకు హాజరై వివాదాలకు అవకాశం ఇవ్వటం ఇష్టం లేక, రాలేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.