తాజా వార్తలు

10/recent/ticker-posts

భూగర్భ జలాలు పెంపుపై క్షేత్రస్థాయి చర్యలు చేపట్టాలి.. జిల్లా కలెక్టరు కె.వెట్రి సెల్వి ...


ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 24: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం"జిల్లాలో భూగర్భ జలాలను పెంచుకునే అంశంపై" సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇరిగేషన్, భూగర్భ జలాలు, డ్వామా, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆ దిశగా క్షేత్ర స్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవాలని, భవిషత్తు కార్యాచరణపై  పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి  మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు గణాంకాలపై నిశితంగా దృష్టి సారించి, పెరుగుదల దిశగా స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. డ్వామా ఆధ్వర్యంలో డిసిల్టేషన్, బుష్ క్లీరెన్స్, ఇంకుడు గుంతలు, కుంటలు పునరుద్ధరణ వంటి పనులకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని ఆదేశించారు. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో కూడా జల సంరక్షణ పద్ధతులుపై స్థానిక సంస్థలు భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉందన్నారు. జలవనరులు శాఖ  ప్రధాన కాలువల్లో లీకేజీలు నివారణ, గట్లు పటిష్టతపై తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

క్షేత్ర స్థాయిలో సమగ్ర నివేదిక అందజేయ్యాలని సూచించారు. భూగర్భ జలాలు శాఖ మండలాలు వారీగా ప్రత్యేక గణాంకాలు, రియల్ టైమ్ పర్యవేక్షణ అందించాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో భూగర్భ జలాలు పెరిగే దిశగా మండల అభివృద్ధి అధికారులు నిర్దిష్ట లక్ష్యాలను సాధించాలని  ఆదేశించారు. జిల్లాలోని 394 గ్రామాల్లో ప్రస్తుతం 194 గ్రామాల్లో 8 నుంచి 20 మీటర్లు  లోతులోనూ, 20 మీటర్లు పైబడి 200 గ్రామాల్లో భూగర్భ జలాలు స్థాయి ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తుతరాలకు నీటివనరులు సమృద్ధిగా ఉండే విధంగా భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని అన్నారు. 

ఆదిశగా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చెయ్యాలని అన్నారు. ప్రభుత్వంతో పాటు, ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ఆ దిశగా  అధికారులు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అడవులు సంరక్షణ పద్ధతుల్లో, విస్తృత స్థాయిలో ఇంకుడు గుంతలు నిర్మాణాలు, చెరువులు పూడిక తీతలు, ఇతర పరిరక్షణ వంటి చర్యలు ద్వారా నూటికినూరుశాతం భూగర్భ జలాలు డిశ్చార్జ్‌ నిల్వలు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. 

రాబోయే వేసవి సీజన్‌లో నీటి అవసరాలు దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా క్షేత్ర స్థాయి పనులు ప్రారంభించాలన్నారు.వచ్చే సమీక్ష సమావేశం నాటికి సమన్వయ శాఖలు అధికారులు సమగ్రనివేదికలు అందజేయాలని, అందుకు అనుగుణంగా జిల్లాలో భవిషత్తు కార్యాచరణ అమలు చేస్తామని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, గ్రౌండు వాటరు డిప్యూటీ డైరెక్టరు పైలా కోదండరామ్, నీటిపారుదల శాఖ యస్ఇ సి.హెచ్. దేవప్రకాష్, ఏపి యంఐపి పిడి డా.యస్. రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజా నాయక్, డిబ్ల్యూయంఏ అడిషనల్ పిడి రాజశేఖర్, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, పొల్యూషన్ బోర్డు, సంబంధిత శాఖల అధికారులు, వివిధ నీటిసంఘాలు ప్రతినిధులు, రైతు నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.