తాజా వార్తలు

10/recent/ticker-posts

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దర్శనం చేసిన రెడ్డి అప్పలనాయుడు దంపతులు


భద్రాచలం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు తన సతీమణి శ్రీమతి రెడ్డి అనురాధతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు.


ఆలయానికి చేరుకున్న రెడ్డి అప్పలనాయుడు దంపతులకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సస్యశ్యామలంగా పాలించాలనీ, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకున్నారు.