Hot Posts

6/recent/ticker-posts

లాజిక్ పాయింట్ పట్టుకున్న రాహుల్...మోడీతో ఢీ !


INDIA NEWS: పాకిస్థాన్ తో యుద్ధం అంటే కాంగ్రెస్ సహా దేశంలోని అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. జై భారత్ అని నినదించాయి. మీరు ఏమి చేసినా మాకు ఓకే. ఈ గడ్డ కోసం మేము మద్దతుగా నిలుస్తామని అవుట్ రేట్ గా మద్దతు ఇచ్చాయి. అయితే భారత్ మాత్రం అనూహ్యంగా కాల్పుల విరమణను ప్రకటించింది. దాంతో విపక్షాలకు మళ్ళీ నోరు చేసుకునే చాన్స్ వచ్చింది. శాంతి చర్చల కోసం ఇంతటి యుద్ధం సంరంభం ఎందుకు అని అంతా అంటున్న నేపథ్యం ఉంది. ఇక పెద్ద పార్టీ పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ అయితే చాలా విషయాల్లో బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉంది. 


పార్లమెంట్ ప్రయ్తేక సమావేశాలు నిర్వహించాలని లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. అందులో ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. ఏప్రిల్ 22న పహిల్గాం లో జరిగిన ఉగ్ర దాడి నుంచి మొదలు పెడితే మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్ తో పాటు అనంతర యుద్ధ పరిస్థితులు, మే 10న కాల్పుల విరమణ వరకూ చోటు చేసుకున్న అనేక అంశాల మీద కూలంకషంగా చర్చించాల్సి ఉందని ఆ లేఖలో రాహుల్ కోరారు. 

ఒక కీలక అంశాన్ని రాహుల్ ఆ లేఖలో లేవనెత్తారు. అందులో లాజిక్ ఉంది. దాంతోనే మోడీ సర్కార్ ని పార్లమెంట్ లో ఇరుకునపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది అని అంటున్నారు. ఆ అంశం ఏంటి అంటే పాక్ భారత్ కాల్పుల విరమణ మొదట అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా ప్రకటిస్తారు అని. భారత్ ఒక స్వతంత్ర దేశం, సర్వ సత్తాక సార్వభౌమ దేశం. భారత్ తన నిర్ణయాలను తాను ప్రకటించగలదు. అలా కాకుండా ఎక్కడో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించడం ఏమిటి అన్నదే కాంగ్రెస్ నిలదీతగా ఉండబోతోంది. అంతే కాదు ఈ మధ్యలో ఏమి జరిగింది అన్నది కూడా లాగే ప్రయత్నం కూడా ఉండొచ్చు అని అంటున్నారు. 

ఇలా అనేక అంశాలలో తమ సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాదు అసలు యుద్ధం అంటూ పాక్ తో మళ్ళీ చర్చలకు ఎలా యూ టర్న్ తీసుకుంటారు అన్నదే విపక్షాల ప్రశ్న. తాము భేషరతుగా మద్దతు ఇస్తే ఈ విధంగా చేయడమేంటి అన్నది కూడా ఉంది. ఇక రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కానీ పార్లమెంట్ ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సమావేశపరుస్తుందా అన్నది ఇక్కడ ప్రశ్న. అయితే కాంగ్రెస్ డిమాండ్ సహేతుకంగా ఉందని అంటున్నారు. 

పెద్ద నిర్ణయాలు అన్నీ పార్లమెంట్ వేదికగా అంతా కలసి కూర్చుని తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. ఇక రాహుల్ మరో డిమాండ్ కూడా చేశారు. అఖిల పక్ష సమావేశాన్ని పిలవాలని. దానికి మోడీయే అధ్యక్షత వహించాలని. ఏది ఏమైనా ట్రంప్ ఉత్సాహమా లేక ప్రోత్సహమా తెలియదు కానీ పాక్ ఇండియా కాల్పుల విరమణ అంటూ ఆయన ట్వీటిన ట్వీట్ ఇపుడు కాంగ్రెస్ కి అంది వచ్చిన అస్త్రంగా మారుతోందా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.