Hot Posts

6/recent/ticker-posts

పాడి పంటల అభివృద్దే ద్వారా దేశాభివృద్ధి : మంత్రి కొలుసు పార్థసారధి


50 శాతం సబ్సిడితో ప్రభుత్వం అందించే వ్యవసాయ పనిముట్లు, పచ్చి రొట్ట, పశువుల దాన అందజేసిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ప్రభుత్వం సబ్సిడి పై ఇచ్చే పథకాన్ని ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలి


నూజివీడు: నూజివీడు మండలం యనమందల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా  50 శాతం సబ్సిడీ పై  పశువుల ధానా,వ్యవసాయ పనిముట్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతులకు ధానా, మరియు పనిముట్లను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి  అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా 50 శాతం సబ్సిడి పై అందించే ధానా, పచ్చి రొట్ట విత్తనాలు, పిల్లిపిసర, జనుము, జీలుగ, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, రోటవేటర్లు,పవర్ స్పెయర్లు, రైతులు అందరూ  సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

50 శాతం సబ్సిడితో ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని అర్హులైన  ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు, రైతులు సహకరించి తద్వారా పశువుల పెంపకం,వ్యవసాయ అభివృద్దికి దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. వ్యవసాయ అభివృద్దే దేశాభివృద్ధి అన్నారు, ఆధునిక వ్యవసాయ యాంత్రిక శక్తిని అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని మంత్రి కోరారు. రైతు పండించిన పంటకు సరైన రేటు రాకపోడం వ్యవసాయ ఖర్చు పెరగడం దృష్టిలో ఉంచుకొని, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఖర్చు తగ్గించడానికి యాంత్రిక శక్తిని వినియోగించుకోవాలని మంత్రి రైతులకు పిలువునిచ్చారు.

ఏలూరు జిల్లాకు 50 శాతం సబ్సిడి పై 1500 మంది రైతులకు సుమారు రూ.4కోట్లతో సబ్సిడితో వ్యవసాయ ఆధునిక యంత్రాలు అందించారన్నారు,మన జిల్లాకు పచ్చి రొట్ట విత్తనాలు సుమారు రూ.7 కోట్లు కేటాయించిందని, రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు, నూజివీడు నియోజవర్గంలో సుమారు 2425 క్వింటాలు పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని సకాలంలో రైతులు వినియోగించుకోవాలని మంత్రి అన్నారు, వ్యవసాయ ఖర్చు తగ్గాలంటే ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతి అవలంభిచాలన్నారు, మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వంతో మాట్లాడి  అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

నియోజకవర్గ పరిధిలో  అటవీ భూముల సాగు చేసే రైతులు అధికంగా ఉన్నారని వారికి సబ్సిడీ పై అందించే విద్యుత్ బోర్ల విషయంలో అధికారులు ఎలాంటి ఇబ్బంది  పెట్టవద్దని మంత్రి సూచించారు.పశు సంవర్ధక శాఖ మరియు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో ఔత్సాహిక రైతులకు,పశువుల పెంపకం దారులకు నిరుద్యోగులకు ప్రోత్సాహంగా ప్రభుత్వము అనేక రుణాలు అందజేస్తుందని ,దీన్ని ప్రతీ ఒక్క పశువుల పెంపకం రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సన్న, చిన్న కారు రైతులు రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే  ఆర్ధిక రుణాలను అంది పుచ్చుకోవలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిటీ రుణాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సన్న, చిన్నకారు రైతులకు ప్రోత్సాహకరమైన ఋణాలు అందుబాటులో ఉన్నాయనీ, వాటిపై అవగహన పెంచుకొని ఋణాలను పొందాలని తద్వారా వ్యాపారాభివృద్ధి చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని రైతులకు పిలుపునిచ్చారు. 

రైతులకు,  ఋణాలపై అవగహన మరియు వాటి లబ్ధిపై, వాటిని పొందే విధానంపై బ్యాంకర్స్, మరియు, అగ్రికల్చర్, ఇతర ప్రభుత్వ అధికారులు కలిసి ప్రతీ నెల ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు,ముక్యంగా పశువుల పెంపకం దారులకు ఋణాలను అందించే భాద్యత మీ పై ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశించిన మంత్రి, అలాగే ఆధునిక ప్రపంచంలో వ్యాపారంలో పోటీ పడాలంటే ఆధునిక టెక్నాలజీ జోడించి వ్యాపారం చేస్తే ఆర్ధిక ఫలాలు లాభాలు  పొందాలన్నారు. 

గొర్రెలు, మేకలు,పశువుల, మూగ జీవుల ఫామ్స్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు వరకు ఋణం 50 శాతం సబ్సిడితో ప్రభుత్వం అందిస్తుందన్నారు.  ప్రభుత్వం అందించే సబ్సిటీ ఋణాలను విస్తృతంగా గ్రామ స్థాయిలో ప్రచారం చేయవలసిన బాధ్యత బ్యాంకర్స్, మరియు ప్రభుత్వ అధికారులపై ఉందని ఆదేశించారు. దీన్ని పశు కాపరులు సద్వినియోగం 
చేసుకోవాలన్నారు. 

అనుభవం కల్గిన వ్యవసాయ అధికారులు రైతులతో మాట్లాడి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యవసాయం పై ఆధునిక పద్ధతులు వినియోగించేలా చూడాలన్నారు,
రైతులు బ్యాంకులకు వెళ్లడం ప్రశ్నించే తత్వం మెరుగు పర్చుకోవలని చూసించారు ఏ ఒక్క రైతుకు,బ్యాంకర్స్ ఋణాలు ఇవ్వమని చెప్పిన పక్షంలో నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే బ్యాంకర్స్ తో మాట్లాడి ఋణాలు ఇప్పించచే బాధ్యత నాది అని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు. 

నా నియోజకవర్గ ప్రజలు వ్యవసాయంతో పాటు పాడి, వ్యాపారంలో కూడా ఆర్ధికంగా ఎదగాలనే ఆకాంక్షతో బ్యాంకర్ల తో మాట్లాడి ప్రతీ ఒక్క పశువుల పెంపకం రైతులకు ఋణాలు ఇప్పించే బాధ్యత నాది అన్నారు దీన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.   బ్యాంకర్లు అందించే ఋణాలపై అవగహన కల్పించేందుకు మరియు ఋణాలు పొందేందుకు త్వరలో  ఒక అధికారిని నియమిస్తామని అందరూ సద్వినియోగం చేసుకోవలన్నారు.

కార్యక్రమంలో పశుసంవర్ధక అధికారులు,  తెలుగుదేశం, కూటమి నాయకులు,   తదితరులు పాల్గొన్నారు.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now