Hot Posts

6/recent/ticker-posts

డా. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి


ఏలూరు: డా. బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అన్నారు.  డా. బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, తదితరులు డా. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 


ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ డా. బాబు జగజ్జీవన్ రామ్ పేదవర్గాల సంక్షేమానికి ఎంతో కృషిచేశారని, విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారన్నారు. అంతటి మహనీయుని జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. 
            
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ  డా. బాబు జగజ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. సమాజంలో అంటరానితనం, కులవివక్ష ను రూపుమాపేందుకు కృషిచేశారని, ఆయన చేసిన సేవలను ప్రజలలోనికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని, డా. బాబు జగజ్జీవన్ రామ్ అందించిన స్పూర్తితో సమాజాభివృద్ధికి నేటి యువత కృషిచేయాలన్నారు. 
           
ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ డా. బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేశారన్నారు.  40 సంవత్సరాల పాటు ఉప ప్రధాని వంటి ఎన్నో ఉన్నత  పదవులు నధిరోహించి  సమాజంలో అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడారన్నారు. ఆయన జీవితం నుండి నేటి యువత ఎన్నో నేర్చుకోవాలన్నారు. 

ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.  

కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాశ్, మైనారిటీల సంక్షేమ శాఖాధికారి ఎన్.ఎస్. కృపావరం, ఉద్యానవన శాఖ డిడి రామ్మోహన్, ఏలూరు తహసీల్దార్ శేషగిరిరావు, ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు, షెడ్యూల్డ్ కులాల సంఘాల నాయకులు  పొలిమేర హరికృష్ణ, మెండెం సంతోష్ కుమార్, దాసరి ఆంజనేయులు, మేతర అజేయబాబు, కలపాల రవి, నేతల రమేష్ బాబు, ధనియాల శంకర్, తోకల రాజేష్, దేవరకొండ వెంకటేశ్వర్లు,  ప్రభృతులు పాల్గొన్నారు.