Hot Posts

6/recent/ticker-posts

ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి అవార్డును అందుకున్న APSWREIS సెక్రటరీ ప్రసన్న వెంకటేష్


VIJAYAWADA, ELURU, KRISHNA: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి అవార్డు (2023)ను APSWREIS సెక్రటరీ వి. ప్రసన్న వెంకటేష్ నేడు డిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో  అందుకున్నారు. సోమవారం నాడు 17వ సివిల్ సర్వీస్ డే సంధర్బంగా డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో వికసిత్ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని హాజరయ్యారు. ఈ సంధర్బంగా పరిపాలనలో ఉత్తమ పనితీరు కనబరిచిన పలువురు ఐఏయస్ అధికారులకు ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం అందించింది. ప్రసన్న వెంకటేష్ జనవరి 2022 నుంచి జూలై 2024 వరకు ఏలూరు జిల్లాకు తొలి కలెకర్ట్ గా పనిచేసిన సమయంలో ఆయన ప్రజలకు అందించిన సేవలకు గాను ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. 


ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ పథకాలను విస్సతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల అమలులో భాగంగా మహిళలు, బాలికల్లో రక్తహీనత నివారణకు కృషి చేశారు. సామాజిక బాధ్యత చొరవ కింద జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ‘అక్షజ’ అనే కార్యక్రమంతో గర్భిణీలు, ప్రసూతి మహిళల ఆరోగ్య సంరక్షణకు పాటుపడ్డారు.


ఈ విధంగా, జిల్లాలో సుపరిపాలన అందించడం ద్వారా ఈ అవార్డుకు ఎంపికైన దేశంలోని 10 జిల్లాల కలెక్టర్లలో ప్రసన్న వెంకటేష్ ఒకరు. ఈ సంధర్బంగా అవార్డు అందజేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రసన్న వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిచేందుకు ప్రజా సేవకునిగా శక్తివంచన లేకుండా తాను కృషి చేస్తానన్నారు.

ఈ అవార్డు అందుకున్న వి. ప్రసన్న వెంకటేష్ ఐఎఎస్ వారికి BCN TV, పశ్చిమ వాహిని దినపత్రిక ఎడిటర్ షకీర్ బాబ్జి షేక్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now