ఏలూరు: జాతీయ స్పూర్తి ప్రస్ఫుటించేలా, పండుగ వాతావరణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశమందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తో కలిసి ఈనెల 26వ తేదీన ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు విస్త్రృత ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే గణతంత్రదినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధిత శాఖల సమన్వయంతో సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. వేడుకల నిర్వహణకు నిర్ధేశించిన మినిట్ టు మినిట్ అనుసరించి ఏర్పాట్లు ఉండాలన్నారు. అలాగే ప్రధాన వేదికు సంబంధించి ఏర్పాట్లు ప్రొటోకాల్ కు అనుగుణంగా రూపొందించాలన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అతి ముఖ్య అతిధులకు, విఐపిలు, ఇతర ప్రజా ప్రతినిధులకు, సాధారణ ప్రజానీకానికి, ప్రత్యేక గ్యాలరీలు, సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భధ్రతాపరంగా బ్యారికేడ్, గ్రౌండ్ లెవలింగ్ భాధ్యత పోలీస్, ఆర్ అండ్ బి శాఖలు అధికారులు, ఆహ్వాన పత్రికలు, కలెక్టరేట్ విద్యుత్ దీపాలతో అలంకరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ స్పూర్తి, సమగ్రత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పధకాలపై హౌసింగ్, పశు సంవర్ధకశాఖ, ఐసిడిఎస్, మెప్మా, విద్యాశాఖ, ఉధ్యానశాఖ, వ్యవసాయం, మత్స్యశాఖ, ఐటిడిఏ కె.ఆర్.పురం, రీసర్వే( రెవిన్యూ సదస్సులు, పిజిఆర్ఎస్) 10 స్టాల్స్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేదిక పుష్పాలంకరణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా ఉధ్యానవన శాఖ, పిడి మెప్మా పర్యవేక్షించాలన్నారు.
వివిధ శాఖల ద్వారా జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పధకాలపై ప్రగతిని కనబర్చేవిధంగా ఆకర్షణీయంగా శకటాల ప్రదర్శన ఉండాలన్నారు. విద్యాశాఖ, డిఆర్డిఏ, ఉధ్యానశాఖ, మత్స్యశాఖ, గిరిజిన సంక్షేమం, రీసర్వే, డ్వామా, అగ్నిమాపకం, పౌర సరఫరాలుశాఖ , పోలీస్ శాఖ, వైద్యశాఖ, ఇరిగేషన్, సంబంధించిన శకటాలు ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచే అధికారులు, సిబ్బందికి ప్రసంసా పత్రాలు అందించేందుకు ఈనెల 23వ తేదీలోగా జిల్లా రెవిన్యూ అధికారికి ప్రతిపాధనలు సమర్పించాలన్నారు. శానిటేషన్, త్రాగునీరు ఏర్పాట్లను నగరపాలక సంస్ధ కమీషనరు పర్యవేక్షించాలన్నారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, వ్యవసాయశాఖ జెడి ఎస్ కె. హబీబ్ భాషా, జిల్లా ఉధ్యానశాఖ అధికారి ఎస్. రామ్మెహన్, ఎపిఎంఐపి పిడి రవికుమార్, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, నగరపాలక సంస్ధ కమీషనరు ఎ. భానుప్రతాప్, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, ఆర్అండ్ బి ఎస్ఇ జాన్ మోషే, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె. భాస్కర్, ఎం. ముక్కంటి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.