Hot Posts

6/recent/ticker-posts

వృద్ధులు,వికలాంగుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, కూటమి ప్రభుత్వానిదే: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి


ఏలూరు/నూజివీడు/చాట్రాయి: రాష్ట్ర వ్యాప్తంగా 63.75 లక్షల మందికి రూ.2,717.31 కోట్లు మేర జనవరి మాసపు ఎన్టీఆర్ భరోసా  పెన్షన్లు అందిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. చాట్రాయి మండలం చాట్రాయి గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదేవిధంగా ఏలూరు జిల్లాలో 2,62,228  మందికి రూ. 113.01 కోట్లు మేర జనవరి మాసపు పెన్షన్లు అందిస్తున్నామన్నారు. చాట్రాయి మండలం లో 8,322,మందికి రూ. 35.16 లక్షలు అందిస్తున్నామన్నారు.


ఎన్టీఆర్‌ భరోసా కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందన్నారు. ఆరేడు నెలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే ధోరణికి స్వస్తి పలికడం జరిగిందన్నారు. ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛను ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు.  దీనిని స్పౌజ్‌ కేటగిరీగా గుర్తిస్తూ పెన్షన్‌ మంజూరు చేస్తున్నమాన్నరు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు  స్పౌజ్‌ కేటగిరీ కింద మంజూరైన ఫంక్షన్లు ఈ నెల నుంచి నుంచి పంపిణీ చేస్తున్నామన్నారు.
 
అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5,402 మందికి కొత్తగా ఫించన్లు అందిస్తుండగా ఏలూరు జిల్లాలో 212 మందికి స్పౌజ్‌ కేటగిరీ కింద పెన్షన్లు మంజూరు
చేశామన్నారు. వీరికి ఈ రోజున రూ. 4 వేల చొప్పున పింఛను పంపిణీ చేస్తున్నామన్నారు.  గత 3నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పెన్షన్‌ తీసుకోకుండా ఉన్న 50 వేల మందికి సైతం బకాయిలతో సహా అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన రూ. 1670 కోట్లను రైతులకు  కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. అన్నారు. 

రైతులకు ధాన్యం డబ్భులు 24 గంటల్లో చెల్లించిన కూటమి ప్రభుత్వం అని మంత్రి తెలిపారు. రైతే రాజు అనే నినాదంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది  కూటమి ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యత.ఫామయిల్ రైతులకు టన్నుకు,రూ. 21 వేలు కిట్టుబాటు ధర ఇచ్చిన ప్రభుత్వం మాది అన్నారు. మామిడి రైతులకు మునుపెన్నడూ లేని విధంగా మామిడి రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో 200 పడకలతో నూతన భవనం ప్రారంభిస్తామన్నారు.

లక్ష గృహాలకు త్వరలో గృహప్రవేశాలు 
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు లక్ష ఇళ్లు పూర్తయ్యాయని, మార్చి నాటికి మరో 50 వేల గృహాల నిర్మాణం పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నామని  మంత్రి పార్ధసారథి చెప్పారు. ఇప్పటికే పూర్తయిన లక్ష గృహాలకు త్వరలో గృహ ప్రవేశాలు నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి తాళాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి, తహశీల్ధార్, పంచాయతీ ప్రెసిడెంట్, శోభనబాబు,కూటమి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.