TELAMGANA:
హైదరాబాద్ వినాయక చవతి ఘనంగా జరుపుకుంటారు. గల్లీ, గల్లీలో వినాయక విగ్రహాలను పెడతారు. అయితే వినాయక చవతి అంటే గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ బడా గణపతి, బాలాపూర్ గణేషుడు. ఇప్పటికే సిటీ వ్యాప్తంగా గణేష విగ్రహాల నిమజ్జనం కొసాగుతోంది. సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ గణనాథుడు, బాలపూర్ గణేషుడి నిమజ్జనం ఉండనుంది. అలాగే మిగతా గణేషుల విగ్రహాల నిమజ్జనం కూడా ఉండనుంది. దీంత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా పోలీసులు గణేష్ శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభా యాత్ర మొత్తం సీసీ కెమెరా నిఘాలో జరగనుంది. బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, లాల్‌దర్వాజా, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎమ్‌జే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా హుస్సేన్‌సాగర్ చేరుకోనుంది. ఇందుకు సంబంధించి అన్ని భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ శోభాయాత్ర 19 కిలోమీటర్ల మేర కొనసాగునుంది.
దీంతో 25 వేల మందితో పటిష్ఠ బందోబస్త్ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ జితేందర్ చెప్పారు. శనివారం ఆయన రాచకొండ, హైదరాబాద్సీపీలు సుధీర్‌బాబు, సీవీ ఆనంద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్అధికారులతో కలిసి శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. అనంతరం బాలాపూర్ చేరుకోని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చార్మినార్, ఎమ్‌జే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఇటు ట్యాంక్ బాండ్ వద్ద కూడా పోలీసుల భద్రత కొనసాగుతోంది. సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం మధ్యాహ్నం 1.30 లూపే జరిగేలా చూస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఉదయం 6 గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకొని శోభాయాత్ర ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేస్తున్నామని వివరించారు. అదే రోజు తెలంగాణ విమోచన దినోత్సవం ఉన్నందున అదనపు బలగాలను బందోబస్తులో ఉంటాయని వివరించారు. కాగా హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం సెప్టెంబర్ 17న సెలవు ప్రకటించింది.