తహశీల్దార్ టి సత్య సాయిబాబా |
టి నర్సాపురం/ఏలూరు జిల్లా: మండలంలో శనివారం నిర్వహించిన నాలుగు నీటి సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవి ఏకగ్రీవం ఎన్నిక జరిగిందని తాసిల్దార్ టి. సత్య సాయిబాబా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో, సాగునీటి నిర్వహణకు ఏర్పాటు చేసిన స్థానిక సంఘాలు. వీటి ప్రధాన లక్ష్యం నీటిని సమర్థవంతంగా పంపిణీ చేయడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, మరియు నీటి వనరులను పరిరక్షించడం. నీటి సంఘాల బాధ్యత అని తెలిపారు.
నీటి సంఘాలు 1997లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేసిన "ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ యాక్ట్" (APFMIS Act) ద్వారా నీటి సంఘాల అవతరణ ఏర్పడ్డాయి. ఈ యాక్ట్ ద్వారా వ్యవసాయదారుల పాలనలోనే నీటి వనరుల నిర్వహణ చేపట్టడం ప్రారంభమైందని అన్నారు.
సభ్యులు మరియు వారి బాధ్యతలు
1. సభ్యుల ఎంపిక: నీటి సంఘాల్లోని సభ్యులు స్థానికంగా ఉండే రైతులు, నీటి వినియోగదారుల సంఘాల ద్వారా ఎన్నికవుతారు.
2. ప్రధాన బాధ్యతలు:
- సాగునీటిని సమర్థవంతంగా అందజేయడం.
- నీటి వనరుల సంరక్షణలో సహకరించడం.
- కాలువల మరియు ఇతర నీటి మార్గాల నిర్వహణ చేయడం.
- నీటి పంపిణీపై పర్యవేక్షణ.
- భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణ పథకాలను తయారు చేయడం.
ప్రయోజనాలు:
- నీటిని సమర్థంగా వినియోగించడం.
- స్థానిక రైతులలో జవాబుదారీతనం పెంచడం.
- సాగు సంబంధిత వ్యయాలను తగ్గించడం.
- నీటి వనరుల దీర్ఘకాలిక వ్యవస్థాపనకు సహాయం చేయడం.
ఇవి వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి వనరుల సంఘాల వినియోగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చారని వెల్లడించారు. మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన.. అప్పలరాజ గూడెం నీటిసంఘం అధ్యక్షులు: తాళ్ల దుర్గారావు, ఉపాధ్యక్షులు: కొప్పాల శీను, డైరెక్టర్లు: బోమల వీరస్వామి, బోమల గంగాధర్, పరిమి ధనలక్ష్మి, మక్కినవారిగూడెం నీటిసంఘం అధ్యక్షులు: దామిశెట్టి కేశవరావు, ఉపాధ్యక్షులు: మక్కిన రామచంద్రరావు, డైరెక్టర్లు: యలమర్తి పార్వతీ, యాదల గంగరాజు, నిక్కంటి వేణుగోపాలస్వామి, పిల్ల ఉమామహేశ్వరి, టి నర్సాపురం నీటిసంఘం అధ్యక్షులు: కొనకళ్ళ మోహన్ కుమార్, ఉపాధ్యక్షులు: సాయిల శ్రీను, డైరెక్టర్లు: లింగారెడ్డి శ్రీనివాస్, యమకొండబాబు, బొడ్డపాటి నాగరాజు, పల్లగాని బాబురావు, బొర్రంపాలెం నీటిసంఘం అధ్యక్షులు: గండబోయిన అప్పలనారాయణ, ఉపాధ్యక్షులు: చింతపల్లి రామారావు, డైరెక్టర్లు: పొడపాటి వెంకటేశ్వరరావు, అందుగుల వెంకన్న, బైగాని వెంకట్రావు, వెదుళ్ళ సూర్యావతి వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తహశీల్దార్ సాయిబాబా తెలిపారు.