Hot Posts

6/recent/ticker-posts

జర్నలిస్టు దుర్గారావు సేవలు చిరస్మరణీయం


ఘనంగా నివాళులు
కంటి వైద్యశిబిరం నిర్వహణ
యూనియన్లకు అతీతంగా హాజరైన జర్నలిస్టులు

విశాఖపట్నం, పశ్చిమ వాహిని ప్రతినిధి: జర్నలిస్టు సంఘాల నాయకుడిగా, సీనియర్ పాత్రికేయుడిగా సోడిశెట్టి దుర్గారావు అందించిన సేవలు చిరస్మరణీయమని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ కొనియాడారు. ఆదివారం ఇక్కడ పోర్టు మైదానంలో (విశ్వనాధ్ కన్వెన్షన్ )యూనియన్లకు అతీతంగా దుర్గారావు రెండో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత డిప్యూటీ మేయర్ తోపాటు పలువురు పాత్రికేయులు దుర్గారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పలు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేయడంతో పాటు పలు సంఘాలకు ప్రాతినిధ్యం వహించి నిరంతరం ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. అందరి మనసులో చెరగని ముద్ర వేసిన ఘనత దుర్గారావు కే దక్కుతుందన్నారు. ఆయన కుటుంబానికి తమ వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామన్నారు. తన సోదరుడుతో దుర్గారావుకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ మన మధ్య కలిసిమెలిసి తిరిగిన దుర్గారావు మృతి చెంది రెండేళ్లు కావస్తున్నప్పటికీ నేటికీ అనేకమంది మనసుల్లో నిలిచి ఉన్నారన్నారు. 

ఆయన మృతిని చాలామంది జర్నలిస్టులు జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది అన్నారు. దుర్గారావుతో ఎంతోమంది మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు చెప్పారు. దుర్గారావు మృతి చెందినప్పటి నుంచి తాను అనేక సందరబ్బాల్లో తన వంతు సహకారం అందజేయడం జరిగిందని అన్నారు. తన పరిధి మేరకు భవిష్యత్తులో కూడా సహకారం అందిస్తామన్నారు. అందరు కలిసి మెలిసి ఉండాలన్నదే తన లక్ష్యం అన్నారు. 

ఈ కార్యక్రమం సమన్వయకర్త జేసాప్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాల్మీకి నాగరాజు మాట్లాడుతూ గత ఏడాది పెందుర్తిలో తాను నగరములో గంట్ల శ్రీను బాబు వేర్వేరు గా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అలాగే ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా వర్ధంతి సందర్బంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. వర్షం కారణంగా క్రికెట్ టోర్నీని వాయిదా వేశామన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులందరికీ లెన్స్ హన్స్ సంస్థ సహాకారముతో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కంటి డ్రాప్స్, మందులు ఉచితముగా అందించగా కళ్ల జోళ్ళు 50 శాతము రాయతీతో అందచేశారు.. పెన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి లోకేష్ కుమార్ మట్టా, కోశాధికారి గుండు రాజు సహకారం అందించారు..  

ఈ కార్యక్రమంలో దుర్గారావు కుమారులు నిఖిల్, లోహిత్, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జేసాప్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాల్మీకి నాగరాజు, రాష్ట్ర కమిటీ సభ్యుడు జాన్ వరబాబు, విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, సహాయక కార్యదర్శి అనిల్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ తిలక్ తోపాటు యూనియన్ లకు అతీతంగా పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొని తమ సంతాపం తెలిపారు.

Staff Reporter
Anil Kumar
Visakhapatnam