Hot Posts

6/recent/ticker-posts

జర్నలిస్ట్ అశోక్ టుంబానికి అండగా ఉంటాం... సంతాప సభలో మానవతా వాదులు


మానవతా వాదుల సహయం రూ. 54,000/.
వంద కేజీల బియ్యం అందజేత

ఏలూరు జిల్లా చింతలపూడి: అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్ట్ అశోక్ వర్ధన్ సంతాపసభలో అధికారులు, ప్రజా సంఘాల నాయకులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అశోక్ కుటుంబానికి అండగా  ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇటీవల ఏలూరు టైమ్స్ జర్నలిస్ట్ అశోక్ వర్ధన్ అనారోగ్యంతో కాలం చేశారు. అశోక్ సంతాప సభ కార్యక్రమం సోమవారం చింతలపూడి మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రింట్ మీడియా అధ్యక్షుడు షేక్ అజాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిషత్ అధ్యక్షుడు డా.బి రాంబాబు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్న రాట్నాలు మాట్లాడుతూ సమాజంలో ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పని చేసే జర్నలిస్టులకు అండగా ఉంటామని అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన అశోక్ కుటుంబానికి చేయూత అందిస్తామని తెలిపారు.
  
డిప్యూటీ తహశీల్దార్ షకీలా మాట్లాడుతూ అశోక్ ఎల్లపుడు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారని గుర్తుచేశారు. మానవతా సంస్థ ముఖ్య సభ్యులు సోమశేఖర్, ఎ.అప్పారావు, మదర్ థెరిస్సా ఫౌండేషన్ చైర్మన్ తూము విజయ్ కుమార్, వివిధ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు సూర్య కుమార్, బాబు, తాటి అప్పారావు, బి.నాగ భూషణం, శేష గిరిరావు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్యాలరావు, డా.బిఆర్ అంబేద్కర్ అభ్యుదయ సంఘం నాయకుడు కె.నాగేశ్వర్రావు, తదితరులు మాట్లాడుతూ అశోక్ భౌతికంగా మన మధ్య లేక పోయినా ఆయన జర్నలిస్ట్ గా చేసిన సేవలు మనలో ఉన్నాయని కొనియాడారు. ఆయన కుటుంబానికి ఎల్లపుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అజాద్, ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు, జిల్లా కోశాధికారి కె.నాగ చిన్నారావు లు మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అశోక్ వర్ధన్ అని అన్నారు. నేడు ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరమని అన్నారు. అశోక్ కుటుంబానికి జర్నలిస్ట్ సంఘాలు అండగా ఉంటాయని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మానవతా, మదర్ థెరిస్సా ఫౌండేషన్, వి ఆర్ వో అసోసియేషన్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు దాతల సహాయంతో రూ. 54,000/లు ఆర్థిక సాయం, రెవెన్యూ శాఖ నుండి వంద కేజీల బియ్యం ఎమ్ పిడిఓ రాట్నలు, ఎంపీపీ రాంబాబు చేతుల మీదుగా అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కిషోర్ వీరయ్య, ముత్తేశ్వరావు, లక్ష్మణ్, ఖలీల్ సూరిబాబు, కృపావరం, సంజయ్, నత్తా వెంకటేశ్వరరావు, బాలస్వామి, రాంబాబు, సునీల్, పాషి, పలు సంఘాల నాయకులు గురవయ్య, సత్తి బాబు, అబ్రర్ హుస్సేన్, వి ఆర్ వో లు తదితరులు పాల్గొన్నారు.
 

Reporter

Bala Swami T