Eluru District collectorate: ఎన్నికల కమీషన్ ఆదేశాలకు అనుగుణంగా ఏలూరులో శుక్రవారం హోం ఓటింగ్ ప్రారంభమైయింది. తొలిరోజు ఈ కార్యక్రమాన్ని ఏలూరు రిటర్నింగ్ అధికారి యం. ముక్కంటి ప్రారంభించి ఆయా ప్రాంతాల్లో హోం ఓటింగ్ తీరును స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 85 సంవత్సరాల పైబడిన వారు 70 మంది ఓటర్లు, దివ్యాంగులు 31 మంది మొత్తం 101 మంది ఓటర్లు హోం ఓటింగ్ కు ధరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి హోం ఓటింగ్ సదుపాయం కల్పించేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఉదయం 9.00 గంటల నుండి సంబంధిత గృహాలను సందర్శించి ఫారం-12డి లో ధరఖాస్తు చేసుకున్నవారికి హోం ఓటింగ్ సదుపాయం కల్పించామన్నారు. ఈ కార్యక్రమం మే 4వ తేదీ శనివారం కూడా నిర్వహించబడుతుందన్నారు. ప్రతి టిం లో పివో, ఎపివో, మైక్రోఅబ్జర్వర్, ఆర్మ్డ్ పోలీస్ గార్డ్, వీడియోగ్రాఫర్ ను నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని సంబంధిత సెక్టార్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారన్నారు.
ఎన్నికల చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎన్నికల వ్యయ పరిశీలకులు టి. జోర్డన్ బూటియా
ఏలూరు/దెందులూరు: ఎన్నికల నేపద్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో సంబంధిత సిబ్బంది అప్రమత్తంగా ఉండి అన్ని వాహనాలను క్షుణంగా తనిఖీ చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు టి. జోర్డన్ బూటియా తెలిపారు. దెందులూరు మండలం కలపర్రు, ,కొవ్వలి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద స్టాటిక్ సర్వే లైన్స్ తనిఖీలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా నగదు, మద్యం, గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి అన్నిరకాల వాహనాలను తనిఖీచేయాలన్నారు. అనుమానం ఉన్నా ముందస్తు సమాచారం ఉన్నా తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.
ఈ సందర్బంగా చెక్ పోస్టులో నిర్వహిస్తున్న రిజిష్టర్లను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు అందించారు. వీరి వెంట ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సహాయ వ్యయ పరిశీలకులు పిఎస్ విఎస్ శివనాగరాజు తదితరులు ఉన్నారు. తొలుత దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల వ్యయ నమోదు సిబ్బందితో సమీక్షించి సంబంధిత రిజిస్ట్రార్లు పరిశీలించారు.
తొలి రోజు జిల్లా మొత్తం 579 మంది హోం ఓటింగ్
ఏలూరు జిల్లాలో హోం ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్నావారిలో తొలి రోజు శుక్రవారం జిల్లా మొత్తం 579 మంది హోం ఓటింగ్ వినియోగించు కోగా, పోలవరం నియోజకవర్గంలో 90 మంది, ఉంగుటూరులో 113 మంది, ఏలూరులో 54 మంది, చింతలపూడిలో 63 మంది, దెందులూరులో 87 మంది, కైకలూరులో 113 మంది, నూజివీడులో 59 మంది హోం ఓటింగ్ వినియోగించుకున్నారు.
Editor
Akhil Babji Shaik