నాన్ లోకల్ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న లోకల్ అభ్యర్థి కావూరి లావణ్య.
దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకత తన గెలుపుకు నాంది అంటున్న కావూరి లావణ్య.
వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలకు ఓటేస్తే బీజేపీ కి వేసినట్లే!
ప్రజలు ఇండియా కూటమికి పట్టం కట్టునున్నారని జాతీయ సర్వేలు, మేధావి వర్గాలు ప్రకటించడం కావూరి లావణ్యకు కలసి వచ్చే అంశం.
ఇండియా కూటమి అభ్యర్థి కావూరి లావణ్య గెలుస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం.
ELURU District, ప్రతినిధి: ఏలూరు పార్లమెంటు బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులలో ప్రధాన పోటీదారునిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండియా కూటమి అభ్యర్థి కావూరి లావణ్య పేరు వినిపిస్తుండటం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఏలూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు నాన్ లోకల్ అభ్యర్థులతో ఒక మహిళ ధీటుగా పోటీ ఇవ్వటం మిగతా పోటీదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కావూరి వారసురాలిగా బరిలో నిలిచిన కావూరి లావణ్య గెలుపు దేశంలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా వస్తున్న సర్వేలు ఆధారంగా పేర్కొనవచ్చు.
దేశంలో బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తాం అని పేర్కొనటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు మేధావులు, జాతీయ మీడియాలో చర్చలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనవిగా రావటంపై కావూరి లావణ్య గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో దళితులకు 27 రకాల వివిధ ప్రభుత్వ పధకాలు ఆపివేయటంతో దళిత సామాజిక వర్గాలు సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపటం కలసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కావూరి లావణ్య 37 కోట్ల రూపాయల మేర ఆస్తులను అఫడవిట్ లో పేర్కొన్నారు.
జిల్లా స్థానికురాలిగా తొలిసారి ఒక మహిళా అభ్యర్థిని 37 కోట్ల రూపాయలు ఆస్తులు ప్రకటించడం ఒక హాట్ టాపిక్ గా మారింది. కావూరి వారి బ్రాండ్ కు సరితూగేలా ఆస్తులు ప్రకటించడం ఆనోటా ఈనోటా చర్చనీయాంశమైంది. మిగతా పార్టీల నాన్ లోకల్ అభ్యర్థులు వారికి కంపెనీలు, పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నప్పటికీ అఫడవిట్ లలో ప్రకటించకపోవటం గమనార్హం. ఆన్ లైన్లో కావూరి లావణ్య అఫడవిట్ పెద్ద సంఖ్యలో డౌన్లోడ్ చేసుకొని వీక్షించటం జిల్లాలో చర్చనీయాంశమైంది. స్వతహాగా ఒక మహిళా అభ్యర్థి ఈమేరకు ఆస్తులు ప్రకటించడంతో ఏలూరు పార్లమెంటు పరిధిలో ఇండియా కూటమి బలపరచిన అభ్యర్థి కావూరి లావణ్య గెలుపుపై జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకోవటం విశేషం.
దేశంలో బీజేపీ కి ఎదురు గాలి వీస్తుండటంతో ఇండియా కూటమికి దేశ ప్రజల మద్దతు ఉండటంతో కావూరి లావణ్యకి కలసివచ్చే అంశంగా జిల్లా ప్రజలు భావిస్తున్నారు. దానికి తోడు ఏపి పిసిసి అధ్యక్షురాలు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావటం, మరియు సిపిఎం, సిపిఐ పార్టీలు, వారి ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాల మద్దతు జిల్లాలో పెద్ద ఎత్తున కావూరి లావణ్యకి ఉండటం కలిసి వచ్చే అంశం పరిగణిస్తున్నారు.
ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇక్కడ ఆంద్రప్రదేశ్ ప్రజలు పెద్ద సంఖ్యలో తెలంగాణలో ఉండటం వారిలో ఏలూరు జిల్లా వాసులు కూడా ఉండటం, వారంతా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు కావడం కావూరి లావణ్యకి కలసివచ్చే అంశం. అదేవిధంగా కావూరి లావణ్య మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ పోలికలతో ఉండటమే కాకుండా ఇందిరా గాంధీ ఆశయాలతో ప్రజా సేవకే అంకితమై రాజకీయాల్లోకి రావటం ఆమెకు కలసి వచ్చే అంశం. ఏది ఏమైనా ఏలూరు పార్లమెంటు బరిలో కావూరి లావణ్య పోటీ అంతిమ విజయంగా ప్రజలు భావిస్తున్నారు.
Editor
Akhil Babji Shaik