Hot Posts

6/recent/ticker-posts

వైసిపి ప్రభుత్వంలో గవర సంక్షేమానికి పెద్ద పీట..


ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలి అంటే వైసిపి గెలవడం అవసరం

ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మీ, ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి కెకె రాజు

Visakhapatnam: గవర సంక్షేమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుందని ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి కెకె రాజు అన్నారు. ఈమేరకు బిర్లా జంక్షన్ వద్ద ఉన్న ఒక హోటల్లో అనకాపల్లి ఎన్నికల పరిశీలకులు బొడ్డేటి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ జిల్లా గవర సామాజిక సంఘీభావ సభలో వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న కెకె రాజు జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

ఈసందర్భంగా బొత్సా ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ విశాఖ ఆడపడుచుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని గుర్తు చేశారు.
కె కె రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావునీ వెన్నుపోటు పొడిచి అధికారన్ని స్వాధీన పరుచుకున్నారని విమర్శించారు.

ఉత్తరాంధ్ర వెనుకబాటు తనానికి మూల కారణమైన చంద్రబాబుకు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విశాఖ షిప్ యార్డ్ ప్రైవేటీకరణను అడ్డుకొని రక్షణ శాఖకు అప్పగించారని గుర్తు చేశారు. ఎన్నికల వన్ సైడ్ కావాలంటే మీ అందరి సహకారం ఎంతైనా అవసరం అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్, వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, గవర సామాజిక వర్గ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Anil Kumar
Staff Reporter
Visakhapatnam