Hot Posts

6/recent/ticker-posts

తైవాన్ లో వరస భూకంప ప్రకంపనలు


తైవాన్ లో భారీ భూకంపాల దెబ్బకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కూడా భూకంపం వచ్చింది. ఈ భూకంపం రెండు వందల సార్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పెద్ద స్థాయిలో భూకంపం రాకపోవడంతో ప్రజలు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగిందని, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 


ఆస్తి, ప్రాణ నష్టం... 
తైవాన్ లో ఇటీవల భూకంపం ధాటికి హువాలియన్ లోని అనేక భవనాలు దెబ్బతిన్నాయి. ఇటీవల సంభవించిన భూకంపంలో అత్యంత తీవ్రతగా 6.3 రిక్టర్ స్కేల్ పై నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు వరస భూకంపాలతో భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం లేకపోవడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now