Hot Posts

6/recent/ticker-posts

వ్యవసాయం మరియు ఉద్యాన పంటలు సాగు విధానాలను పరిశీలించిన తిరుపాలురెడ్డి

 

ఏలూరు:  గొర్రెల, మేకల  పెంపకం దార్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని  రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.  స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం వెనుక గల జిల్లా పశువైద్యశాల ప్రాంగణంలో నిర్మించిన జిల్లా గొర్రెల పెంపకందారులు సహకార యూనియన్ భవనాన్ని ఆదివారం మంత్రి నాగేశ్వరరావు  రాజ్యసభ సభ్యులు బీడా మస్తాన్ రావు,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, లతో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గొర్రెల, మేకల  పెంపకం దార్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ తో గొర్రెలను అందిస్తున్నదన్నారు.  గొర్రెల, మేకల ఆరోగ్య సంరక్షణ, అభివృద్ధికి రాష్ట్రంలో 4 ప్రదేశాలలో 4 కోట్ల రూపాయలతో సంరక్షణ  యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.   

కార్యక్రమంలో  రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్  చైర్మన్ జి. ప్రకాష్ యాదవ్,  పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి. నెహ్రు బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ,  కారుమూరి సునీల్ యాదవ్, వై.ఎస్.ఆర్.సి పి . జిల్లా బి.సి. సెల్ అధ్యక్షులు ఘంటా ప్రసాదరావు, టిటిడి బోర్డు మెంబెర్ నెరుసు నాగసత్యం యాదవ్ , పలువురు యాదవ సంఘ నాయకులు, ప్రభృతులు పాల్గొన్నారు. 



చిన్న వెంకన్నను దర్శించుకున్న ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి


ద్వారక తిరుమల: ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డిని ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ సలహాదారు  ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి స్వామివారి బంగారు వాకిలి గుండా ప్రదక్షిణ చేసి అమ్మవార్లను స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు శేష వస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి జ్ఞాపికను ఆయనకు ఆలయ ఏఈవో మెట్టపల్లి దుర్గారావు అందజేశారు.