ఈ సమయంలోనే బీజేపీతో పొత్తు అంశంపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, జనసేనకు 40 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని చెబుతున్నారు. ఆ రెండు పార్టీల నుంచి 50 అసెంబ్లీ 10 ఎంపీ స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఈ అంశం పైన చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేసారు. ఇక..సీట్ల సర్దుబాటు - పవర్ షేరింగ్ పైన మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆ తరువాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పైన అధికారికంగా ప్రకటనకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
ఇక, బీజేపీ తమ రెండు పార్టీలతో కలవటం పైన మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను..నియోజకవర్గాలను తమ అధినేత పవన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంది కాబట్టి..టీడీపీ నేత చింతకాయల విజయ్‌తో మర్యాద పూర్వకంగానే కలిశామని చెప్పారు. అనకాపల్లి ఎంపీ పోటీ అంశం చర్చకు రాలేదని, తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని నాగబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందని నాగబాబు పేర్కొన్నారు. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అవసరం లేదని చెప్పుకొచ్చారు.