Hot Posts

6/recent/ticker-posts

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్


ఏలూరు: జిల్లాలో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎటువంటి పొరబాట్లు దొర్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కు జరగకుండా పక్డ్బందిగా చర్యలు తీసుకోవాలన్నారు.

గత ఏడాది అనుభవాలతో ఈసారి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప విద్యార్థులతో పాటు టీచర్స్ కూడా సెల్ ఫోన్లు తీసుకురాకుడదని నిర్ణయిoచడం జరిగిందన్నారు. జిల్లాలో 139 పరీక్షా కేంద్రాలను ముందుగానే తనిఖీ చేయాలని సూచిస్తూ, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు, లాప్ టాప్ లు, కెమెరాలు, ఇ యర్ ఫోన్లు, స్పీకర్స్, స్మార్ట్ వాచ్ ల్లు, బ్లూ టూత్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమంతించబడవన్నారు.

సమావేశంలో ముందుగా జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం ఎస్ ఎస్ సి మార్చి 2024 పరీక్షలకు సంబంధించిన నివేదికను కలెక్టర్ కు సమర్పించారు. జిల్లాలో 10 తరగతి పరీక్షలకు మొత్తం 32,355 మంది హాజరుకానున్నారని, వీరిలో 16,760 మంది బాలురు, 15,595 మంది బాలికలు ఉన్నారని వీరిలో రెగ్యులర్ విద్యార్థినీ విద్యార్థులు 24,125 కాగా ప్రైవేట్ విద్యార్థిని విద్యార్థులు 8,230 మొత్తం సంఖ్య 32,355 మంది హాజరు కానున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 139 మంది చొప్పున చీఫ్ సూపరిండెంటెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులను నియమించామన్నారు. 

పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్ల నియామిక ప్రక్రియ చేస్తున్నామన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్ధులను ఉదయం 8.45 నుంచి 9.30 కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన వారిని కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, అడిషనల్ ఎస్పీ జి.స్వరూప రాణి సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.