ఏలూరు జిల్లా: చింతలపూడి రాప్తాడులో ఆంధ్రజ్యోతి వీడియో గ్రాఫర్ పై దాడికి నిరసనగా దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని జిల్లా APWJ. వైస్ ప్రెసిడెంట్ అజాద్ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మరియు మద్దతు తెలిపిన జర్నలిస్ట్స్ సంఘాల అధ్వర్యంలో చింతలపూడి ఎస్సై కుటుంబరావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంధర్బంగా జిల్లా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వైస్ ప్రెసిడెంట్ అజాద్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు.
ఇటీవల జర్నలిస్ట్స్ పై దాడులు పెరిగాయని అన్నారు. దెందులూరు, చింతలపూడి, ఇప్పుడు రాప్తాడులో ఇలా జర్నలిస్ట్స్ పై రాజకీయ పార్టీలకు చెందిన అల్లరి మూకలు దాడులు చేయడం జర్నలిస్టులకి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అజాద్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రెస్ క్లబ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సభ్యులు, apjf జిల్లా కోశాధికారి నాగ చిన్నారావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాగ చిన్నారావు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు జర్నలిస్ట్స్ పై దాడులు చేయడం పైశాసిక చర్యగా విమర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సభ్యులు మూర్తి, సతీష్ సీనియర్ పాత్రికేయులు మరియు మీడియా ప్రతినిధులు కె.వీరయ్య, జిన్నా, రామకృష్ణ, హరి, మూర్తి, కిషోర్, రాజు, రవి, అశోక్, అజయ్, ముత్తేశ్వర్రవు, లక్ష్మణ్, నరేష్, ముత్యాల శ్రీనివాస్, ప్రతాప్, అశోక్ వర్ధన్, పవన్, నాగేశ్వరరావు, సురేష్, వెంకట్, బాలు సామ్నా జిల్లా సభ్యుడు సంజయ్ తదితరులు పాల్గొన్నారు.