Hot Posts

6/recent/ticker-posts

ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులు క్షేమం


ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి: జీలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డా. పాల్ సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు.  

బాలుర వసతి గృహంలోని 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వెంటనే వసతి గృహంలో మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్యం అందించడం జరిగిందన్నారు. వారిలో ఇద్దరు విద్యార్థులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితితో పాటు వసతి గృహంలోని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కుదుటపడే వరకు వసతి గృహంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని డా. పాల్ సతీష్ తెలిపారు.